వందేళ్లు పూర్తి చేసుకున్న ఐఐటీ రామ‌య్య‌

తెలంగాణ విద్యావేత్తకు అభినంద‌న‌ల వెల్లువ‌

హైద‌రాబాద్ : ఎంతో మందిని ఐఐటీయ‌న్లుగా మార్చిన తెలంగాణ‌కు చెందిన విద్యావేత్త రామ‌య్య ఇవాల్టితో 100 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. శ‌త వసంతాలు పూర్తి చేసుకున్న సంద‌ర్బంగా ఆయ‌న‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ చేస్తున్నారు ప్ర‌ముఖులు. ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత అభినందించారు. విష‌యం తెలుసుకున్న వెంట‌నే మాజీ మంత్రి కేటీఆర్ స్వ‌యంగా ఐఐటీ రామ‌య్య ఇంటికి వెళ్లారు. సామాజిక ఉద్యమకారుడు చుక్కా రామయ్యకు 100వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

విద్యానగర్ లో ఉన్న‌ చుక్కా రామయ్య నివాసానికి వెళ్లి శాలువాతో సత్కరించారు. ఆయ‌న ఆరోగ్యం గురించి వాక‌బు చేశారు. ఆ దేవుడు మ‌రిన్ని ఏళ్లు బ‌తికేలా ఆశీర్వ‌దించాల‌ని కోరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐఐటీ పూర్తి చేసి ప్రపంచ దేశాల్లో స్థిరపడడానికి కారణం చుక్కా రామయ్య అని కొనియాడారు. విద్యా ప్రదాత కాకుండా తెలంగాణ పోరాటంలో, రాజకీయాల్లో దిక్సూచిగా తన పాత్ర పోషించాడని కొనియాడారు. అలాంటి చుక్కా రామయ్య 100వ బర్త్ డే జరుపుకోవడం మనందరికీ ఎంతో స్ఫూర్తి దాయకమని కేటీఆర్ అన్నారు. కేటీఆర్ తో పాటు జూలూరి గౌరీశంక‌ర్ కూడా హాజ‌ర‌య్యారు. ఐఐటీ రామ‌య్య‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Related Posts

రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *