పార్టీ హై క‌మాండ్ నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉంటా

స్ప‌ష్టం చేసిన డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క పీసీసీ చీఫ్ ప‌ద‌వికి తాను రాజీనామా చేయ‌డం, తాను పార్టీ నుంచి వీడుతున్నానంటూ జ‌రుగుతున్న ప్ర‌చారంపై తీవ్రంగా స్పందించారు డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్. తాను ముందు నుంచీ పార్టీకి విధేయుడిగా ఉన్నాన‌ని, ఎల్ల‌ప్ప‌టికీ ఉంటాన‌ని ప్ర‌క‌టించారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. తాను , సీఎం సిద్ద‌రామ‌య్య పార్టీ హైక‌మాండ్ తీసుకునే ఏ నిర్ణ‌యానికైనా క‌ట్టుబ‌డి ఉంటామ‌ని ఇప్ప‌టికే స్ప‌ష్టం చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ప్ర‌స్తుతం రాజ‌కీయాల నుంచి కాకుండా పార్టీకే గుడ్ బై చెప్పి కొత్త కుంప‌టి ఏర్పాటు చేస్తారంటూ డీకే శివ‌కుమార్ పై జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ త‌రుణంలో ఢిల్లీ వేదిక‌గా చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయి. ఏం జ‌రుగుతుందోన‌న్న ఉత్కంఠ నెల‌కొంది. దీనికి పుల్ స్టాప్ పెట్టే ప్ర‌య‌త్నం చేశారు డిప్యూటీ సీఎం.

ఇత‌ర పార్టీల కంటే కాంగ్రెస్ పార్టీలోనే స్వేచ్ఛ ఎక్కువ‌. ఎమ్మెల్యేలు, మంత్రులు పార్టీ హై క‌మాండ్ ను క‌లుస్తుంటారు. వ‌ద్ద‌ని చెప్పే హ‌క్కు త‌న‌కు లేద‌న్నారు డీకే శివ‌కుమార్. వారు విందు ఏర్పాటు చేసుకున్నారు. కొత్త పీసీసీ చీఫ్ ను ఎన్నుకోవాల‌ని అనుకున్నారు. న‌లుగురు లేదా ఐదు మంది డిప్యూటీ సీఎంల‌ను నియ‌మించాల‌ని ముందు నుంచి కోరుతున్నార‌ని అది వారి హ‌క్కు అని కాద‌నే స్వేచ్ఛ త‌న‌కు లేద‌న్నారు డీకే శివ‌కుమార్. కర్ణాటకలో అధికార పార్టీలో చెలరేగిన వివాదానికి తెరదించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఎమ్మెల్యేల‌ను కూడ‌గ‌ట్టానంటూ జ‌రుగుతున్న ప్ర‌చారం పూర్తిగా అబ‌ద్ద‌మ‌న్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *