విలువ‌ల‌తో కూడిన విద్య స‌త్య‌సాయి యూనివ‌ర్శిటీ ప్ర‌త్యేక‌త‌

ప్ర‌శంస‌లు కురిపించిన ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్

శ్రీ సత్యసాయి జిల్లా : విలువలతో కూడిన విద్య శ్రీ సత్యసాయి యూనివర్సిటీ ప్రత్యేకత అని ప్ర‌శంస‌లు కురిపించారు రాష్ట్ర విద్య‌, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. పుట్టపర్తిని సందర్శించే ప్రతి హృదయంలో సత్యసాయి బాబా ప్రేమ, కరుణ, ఆధ్యాత్మిక శక్తి ప్రకాశిస్తుందని అన్నారు. ధైర్యానికి, త్యాగానికి, ఆధ్యాత్మికతకు ప్రతీక రాయలసీమ అని స్ప‌ష్టం చేశారు. ఈ నేలలోనే ప్రపంచ ఆధ్యాత్మిక కిరణం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జన్మించారని అన్నారు. లవ్ ఆల్, సర్వ్ ఆల్ అనే బాబా నినాదాన్ని జీవితంలో భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా యువతకు పిలుపునిచ్చారు నారా లోకేష్‌.

పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ కాన్వకేషన్ లో పాల్గొన్నారు. ప్రశాంతి నిలయం పూర్ణచంద్ర ఆడిటోరియంలో జరిగిన ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణ‌న్ , విశిష్ట అతిథిగా సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుతో పాటు మంత్రులు వంగ‌ల‌పూడి అనిత‌, స‌త్య కుమార్ యాద‌వ్, ఎమ్మెల్యేలు హాజ‌ర‌య్యారు. సాయి సిద్ధాంతాన్ని అమలు చేస్తూనే, సాంకేతికత, ఆవిష్కరణలను ఉపయోగించడం ద్వారా సంక్షేమానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయాల‌ని కోరారు. బాబా ప్రపంచంలోని నలుమూలలా ఉన్న కోట్ల మందిని ప్రభావితం చేయగలిగారని కొనియాడారు. సాయి సిద్ధాంతాన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు . సాయి బాబా స్పూర్తితో వెల్తీ, హెల్తీ, హ్యపీ సొసైటీని రూపొందించేలా కృషి చేయాలని కోరారు. కోయంబత్తూరు గాంధీగా ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కు పేరుందన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *