హామీలు స‌రే ఆచ‌ర‌ణ మాటేంటి..?

Spread the loveకాంగ్రెస్ స‌ర్కార్ ను ప్ర‌శ్నించిన హ‌రీశ్ రావు హైద‌రాబాద్ : రాష్ట్రంలో పాల‌న గాడి త‌ప్పింద‌న్నారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ మంత్రుల మాటలు కోటలు దాటితే, ఆచరణ గడప కూడా దాటదు అని చెప్పడానికి నగరానికి నలువైపులా పూర్తి కాకుండా ఉన్న టిమ్స్ ఆస్పత్రులే నిదర్శనం అన్నారు. హ‌రీశ్ రావు మీడియాతో మాట్లాడారు. ఆసుపత్రుల నిర్మాణాలు పూర్తి చేయకుండా, పేదలకు వైద్యం అందించకుండా క్రిమినల్ నెగ్లిజెన్స్‌కు…

newsseals-HarishRao
Spread the love

కాంగ్రెస్ స‌ర్కార్ ను ప్ర‌శ్నించిన హ‌రీశ్ రావు

హైద‌రాబాద్ : రాష్ట్రంలో పాల‌న గాడి త‌ప్పింద‌న్నారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ మంత్రుల మాటలు కోటలు దాటితే, ఆచరణ గడప కూడా దాటదు అని చెప్పడానికి నగరానికి నలువైపులా పూర్తి కాకుండా ఉన్న టిమ్స్ ఆస్పత్రులే నిదర్శనం అన్నారు. హ‌రీశ్ రావు మీడియాతో మాట్లాడారు. ఆసుపత్రుల నిర్మాణాలు పూర్తి చేయకుండా, పేదలకు వైద్యం అందించకుండా క్రిమినల్ నెగ్లిజెన్స్‌కు పాల్పడుతున్నది ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ధ్వ‌జ‌మెత్తారు. కరోనా తర్వాత వందేళ్ల ముందు చూపుతో కేసీఆర్ హైదరాబాద్ నలువైపులా టిమ్స్ ఆసుపత్రులకు రూపకల్పన చేశార‌ని చెప్పారు. ఏప్రిల్ 26, 2022 నాడు దేశ చరిత్ర లోనే ఒకే రోజు మూడు ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులకు శంకుస్థాపన చేసి రికార్డు సృష్టించార‌ని గుర్తు చేశారు.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు శరవేగంగా జరిగిన ఆసుపత్రుల నిర్మాణ పనులు కాంగ్రెస్ రాగానే నత్తనడకన సాగుతున్నాయని ఆరోపించారు హ‌రీశ్ రావు. ఆసుపత్రులు పూర్తయితే కేసీఆర్ రి ఎక్కడ పేరు వస్తుందో అనే కురచ బుద్దితో రేవంత్ రెడ్డి ఉద్దేశ్య పూర్వకంగానే టిమ్స్ ఆసుపత్రులను పూర్తి చేయడం లేదంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. కమీషన్ల కోసం రెండేళ్లుగా పనులు పూర్తి చేయకుండా, వైద్య సేవలు అందకుండా ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నది స‌ర్కార్ అంటూ ఫైర్ అయ్యారు.
మొన్న అక్టోబర్ 3 నాడు బీఆర్ఎస్ పార్టీ తరుపున తాము కొత్తపేట టిమ్స్ ఆసుపత్రి సందర్శించి, ఆసుపత్రుల నిర్మాణాలు పూర్తి చేయడంతో ప్రభుత్వ పైఫల్యాన్ని నిలదీశామ‌న్నారు హ‌రీశ్ రావు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports