జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పి తీరాల్సిందే

టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బుద్దా వెంక‌న్న‌

విజ‌య‌వాడ : టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బుద్దా వెంక‌న్న మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌ను త‌క్ష‌ణ‌మే ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పి తీరాల్సిందేన‌ని అన్నారు. ప‌ర‌కామ‌ణి చోరీ కేసులో భగవంతుడి సొమ్ము దోచుకున్న వారిని వెన‌కేసుకు రావ‌డం ప‌ట్ల తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ప‌ర‌కామ‌ణి చోరీ కేసులో నిందితుడు ర‌వికుమార్ ఇచ్చిన వాంగూల్మం పై స్పందించారు. ఈ సంద‌ర్బంగా మీడియాతో మాట్లాడారు. ఓ వైపు త‌ను మ‌హాపాపం చేశానంటూ ఒప్పుకుంటే ఇంకో వైపు ఖండించాల్సింది పోయి అది నేర‌మే కాన‌ట్టు జ‌గ‌న్ రెడ్డి పేర్కొన‌డం ప‌ట్ల ఫైర్ అయ్యారు బుద్దా వెంక‌న్న‌. దీన్నిబ‌ట్టి చూస్తేంటే భ‌గ‌వంతుడి పై ఎంత న‌మ్మ‌కం వుందో అర్ధ‌మ‌వుతుంద‌న్నారు. ప‌ర‌కామ‌ణీ చోరీ కేసు చాలా చిన్న‌ద‌ని భ‌క్తుల మ‌నోభావాలు పట్టించు కోకుండా వ్యాఖ్య‌లు చేయ‌టం సిగ్గులేని త‌న‌నానికి నిద‌ర్శనమ‌న్నారు.

ఎందుకంటే ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు దోచుకున్న‌ జ‌గ‌న్ కి ప‌ర‌కామ‌ణి చోరీ కేసు చిన్న‌గానే క‌నిపిస్తుంద‌ని అన్నారు. ఎందుకు అంతగా భుజాలు త‌డుము కుంటున్నాడంటూ ప్ర‌శ్నించారు. తాను దొంగ‌త‌నం చేశాన‌ని, ప‌శ్చాత్తాపంతో వ్యాపారం ద్వారా సంపాదించిన ఆస్తుల్లో 90 శాతం శ్రీవారికి రాసి ఇచ్చిన‌ట్లు ర‌వి కుమార్ చెప్ప‌టం చూస్తే తాడేప‌ల్లి నుంచి వ‌చ్చిన స్క్రిప్ట్ చ‌దివాడ‌న్న విష‌యం క్లియ‌ర్ గా అర్ధ‌మ‌వుతుంద‌న్నారు. వ్యాపారం ద్వారా అన్ని కోట్ల రూపాయలు సంపాదించిన ర‌వికుమార్ కు ప‌ర‌కామ‌ణి లో చోరీ చేయాల్సిన అవ‌స‌రం ఎందుకు వుంటుందని ప్ర‌శ్నించారు బుద్దా వెంక‌న్న‌.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *