తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ తీసేకుందుకు సీఎం కుట్ర‌

సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన మాజీ మంత్రి హ‌రీశ్ రావు

హైద‌రాబాద్ : మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డిపై. మంగ‌ళ‌వారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివ‌స్ ను నిర్వ‌హించారు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో. ఇవాళ తెలంగాణ భ‌వ‌న్ లో తెలంగాణ త‌ల్లి, అంబేద్క‌ర్, జ‌య‌శంక‌ర్ విగ్ర‌హాల‌కు పూల‌మాలలు వేసి నివాళులు అర్పించారు. నాడు తెలంగాణ వెనుకబడ్డది కాదు వెనుక బడేయబడ్డదని అన్నారు. కానీ నేడు రేవంత్ పాలనలో మళ్లీ వెనుకబాటుకు గురవుతోందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు హ‌రీశ్ రావు. డిసెంబర్ 9 తెలంగాణ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన రోజు అని పేర్కొన్నారు. నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష ఫలితమే డిసెంబర్ 9 నాటి తెలంగాణ ప్రకటన అని గుర్తు చేశారు.

నాడు కేసీఆర్ ప్రాణాలకు తెగించి కొట్లాడకపోతే డిసెంబర్ 9 ప్రకటన వచ్చేది కానే కాద‌న్నారు. నేడు మనం చూస్తున్న జూన్ 2 ఆవిర్భావ దినోత్సవం ఉండేది కాదని చెప్పారు. కేసీఆర్ దీక్ష, అమరుల త్యాగ ఫలితమే ఈనాటి తెలంగాణ రాష్ట్రం అని అన్నారు. చరిత్ర గురించి మాట్లాడితే కేసీఆర్ అంటే పోరాటం, కేసీఆర్ అంటే త్యాగం. కానీ రేవంత్ రెడ్డి అంటే వెన్నుపోటు, రేవంత్ అంటే ద్రోహం అని ఆరోపించారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామాలు చేయమంటే జిరాక్స్ పేపర్లు ఇచ్చి మోసం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. ఉద్యమకారుల మీద రైఫిల్ పట్టుకొని బయలు దేరిన రైఫిల్ రెడ్డి ఆయన. అలాంటి వ్యక్తి నేడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తూ చరిత్ర హీనుడిగా మిగిలి పోతున్నాడని ధ్వ‌జ‌మెత్తారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *