సీఎంన‌వుతా త‌డాఖా చూపిస్తా : కల్వ‌కుంట్ల క‌విత

2014 నుంచి జ‌రిగిన అక్ర‌మాల బండారం బ‌య‌ట పెడతా

హైద‌రాబాద్ : నా టార్గెట్ సీఎం కావ‌డం. ఇవాళ కాక పోవ‌చ్చు. కానీ ఏదో ఒక రోజు తెలంగాణ రాష్ట్రానికి సీఎం కావ‌డం ప‌క్కా అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. తాను ఏనాడూ త‌ప్పు చేయ‌లేద‌న్నారు. ఒక‌వేళ త‌ప్పు చేసిన‌ట్ల‌యితే బ‌హిరంగంగానే క్ష‌మాప‌ణ‌లు చెప్పేందుకు సిద్దంగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించారు. తాను ముందు నుంచి తెలంగాణ ఉద్య‌మానికి ఊపిరి పోశాన‌ని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌లో అమ‌రులైన కుటుంబాల‌ను ఆదుకోవాల‌ని కోరాన‌ని, చాలా మందికి సాయం అంద‌లేద‌ని ఈ విష‌యాన్ని తాను ప్ర‌స్తావించాన‌ని చెప్పారు. ఇందులో త‌ప్పేముంద‌ని ప్ర‌శ్నించారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌.

జాగృతి జ‌నం బాట కార్య‌క్ర‌మంలో భాగంగా క‌ల్వ‌కుంట్ల క‌విత శుక్ర‌వారం అంబ‌ర్ పేట‌లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా స్థానిక‌ల‌తో సంభాషించారు. వారి స‌మ‌స్య‌ల‌ను విన్నారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు. త‌న‌పై లేనిపోని ఆరోప‌ణ‌లు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధ‌వ‌రం కృష్ణారావు, బీజేపీఎల్పీ నాయ‌కుడు మ‌హేశ్వ‌ర్ రెడ్డిల‌కు లీగ‌ల్ నోటీసులు పంపించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు క‌విత‌. ఇదే స‌మ‌యంలో మాధ‌వ‌రంపై భ‌గ్గుమ‌న్నారు. త‌న కొడుకు ప్రణీత్ ప్రణవ్ విల్లాల్లో భాగంగా ఉన్నార‌ని ఆరోపించారు. అక్కడ వారు ఒక సరస్సును ఆక్రమించి ప్రజలకు ప్రవేశం నిరాకరించారని ఆవేద‌న వ్యక్తం చేశారు. హైడ్రాకు ద‌మ్ముంటే ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించాల‌ని డిమాండ్ చేశారు. లీజుకు తీసుకున్న భూములను మార్చడం ద్వారా బీఆర్ఎస్ అవినీతికి కిటికీలు తెరిస్తే కాంగ్రెస్ HILT ద్వారా తలుపులు తెరిచింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *