సింగ‌రేణి సీఎండీగా కృష్ణ భాస్క‌ర్

మాతృ విభాగానికి ఎన్. బ‌ల‌రామ్

క‌రీంన‌గ‌ర్ జిల్లా : దేశంలోనే అత్యంత పేరు పొందిన సంస్థ సింగ‌రేణి గ‌నుల సంస్థ‌. ఈ సంస్థ‌కు సీఎండీగా విశిష్ట సేవ‌లు అందించారు ఎన్. బ‌ల‌రామ్. త‌ను ఏడేళ్ల పాటు డిప్యూటేష‌న్ పై కొలువు తీరారు. తిరిగి మాతృ విభాగానికి వెళ్లి పోయారు. ఈ నేపథ్యంలో సింగరేణికి సీఎండీ (ఎఫ్ఏసీ)గా దేవరకొండ కృష్ణ భాస్కర్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన సింగరేణి భవన్ లో సీఎండీగా బాధ్య‌త‌లు స్వీకరించారు. ఆయన ప్రస్తుత ఛైర్మన్ ఎన్. బలరామ్ నుండి బాధ్యతలను తీసుకున్నారు. ఆయనకు సింగరేణి డైరెక్టర్లు, జీఎంలు స్వాగతం పలికారు.

ఇదిలా ఉండ‌గా డి.కృష్ణ భాస్కర్ 2012 బ్యాచ్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన తెలంగాణ ట్రాన్స్ కో సీఎండీగానూ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌కు స్పెషల్ సెక్రటరీగానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆయన రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలకు కలెక్టర్ గా విధులు నిర్వహించారు. తెలంగాణ ఇండస్ట్రీస్ శాఖకు డైరెక్టర్ గానూ, రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖకు స్పెషల్ సెక్రటరీ గానూ వ్యవహరించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *