ఐదుగురు ఐఏఎస్ అధికారులకు ప‌దోన్న‌తి

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న ఏపీ స‌ర్కార్

అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణయం తీసుకుంది. ప‌నితీరు ఆధారంగా పలువురు ఐఏఎస్ ల‌కు ప‌దోన్న‌తి క‌ల్పిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌యానంద్. సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు శ‌నివారం జారీ చేసిన ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఇదిలా ఉండ‌గా 2010 బ్యాచ్‌కు చెందిన ఐదుగురు ఐఏఎస్ అధికారులను సూపర్ టైమ్ స్కేల్‌ (పే మ్యాట్రిక్స్ లెవల్–14) క్యాడర్‌కు సమానంగా, 2026 జనవరి 1 నుండి అమలులోకి వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించిందని స్ప‌ష్టం చేశారు. ప్రభుత్వ కార్యదర్శులు గా పదోన్నతి పొందిన అధికారులలో చదలవాడ నాగరాణి , డా. నారాయణ భరత్ గుప్తా, అమ్రపాలి కటా, జె. నివాస్, గంధం చంద్రుడు ఉన్నారని పేర్కొన్నారు.

పదోన్నతుల అనంతరం డా. నారాయణ భరత్ గుప్తాను అదే పదవిలో కొనసాగిస్తూ కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ గా, ఆర్‌యూఎస్ఏ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా కొనసాగిస్తున్న‌ట్లు తెలిపార. ఇక అమ్రపాలి కటా ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్‌పర్సన్ గా మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగనున్నారని పేర్కొన్నారు సీఎస్. గంధం చంద్రుడిని కార్మిక శాఖ కమిషనర్‌గా నియమిస్తూ, పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఎం.వి. శేషగిరి బాబును రిలీవ్ చేశామ‌న్నారు. ఇక‌ చదలవాడ నాగరాణి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్‌గా అదే పదవిలో కొనసాగుతార‌ని స్పష్టం చేశారు. అవసరమైన చోట్ల పోస్టుల సృష్టి, అప్‌గ్రేడేషన్, క్యాడర్ సమానత్వానికి సంబంధించిన ఉత్తర్వులు వేరుగా జారీ చేస్తామని ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ వెల్ల‌డించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *