న్యూ ఇయర్ రోజున స్విగ్గీ, జొమాటో సేవలు బంద్

ప‌లు సంస్థ‌ల‌కు కోలుకోలేని షాక్ ఇచ్చిన ఉద్యోగులు

హైద‌రాబాద్ : నూత‌న సంవ‌త్స‌రం వ‌చ్చేందుకు ఇంకా కొద్ది గంట‌లు మాత్ర‌మే మిగిలి ఉంది.ఈ స‌మ‌యంలో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు గిగ్ అండ్ ప్లాట్ ఫార‌మ్ వ‌ర్కర్స్ . ఈ మేర‌కు త‌మ‌కు ఉద్యోగ భ‌ద్ర‌త కావాల‌ని కోరారు. ఈ సంద‌ర్బంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు .స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వర్కర్లు తాము ఈనెల 31వ తేదీన బంద్ కు పిలుపు ఇచ్చామ‌ని తెలిపారు. ఉబెర్, ఓలా, ర్యాపిడో డ్రైవర్లు అదే రోజు స్ట్రైక్ పాటించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్ల‌డించారు.

పని వేళలు, భద్రతతో పాటు తగిన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పారదర్శక పే స్ట్రక్చర్ కల్పించాలని.. కిలోమీటర్‌కు రూ.20 కనీసం వేతనం ఇవ్వాలంటూ కోరుతున్నారు వ‌ర్క‌ర్స్. అంతే కాకుండా రోజుకు 8 గంటల పనిదినం.. అంతకు మించి పని చేస్తే అదనపు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అంతే కాకుండా కేవ‌లం 10 నిమిషాల డెలివరీ విధానాన్ని తొలగించాలని, దీని వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్య‌క్తం చేశారు. మొత్తంగా ప‌ని విధానంలో మార్పులు రావాల‌ని, త‌మ‌కు సెక్యూరిటీ క‌ల్పించాల‌ని కోరుతున్నారు వ‌ర్క‌ర్స్.

  • Related Posts

    ఆర్థిక ప‌రిస్థితి మెరుగు ప‌ర్చేందుకు ‘ఏఐ’ వినియోగం

    అమ‌రావ‌తి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రముఖ ఆర్థికవేత్త, మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్‌తో సమావేశమయ్యారు. వ్యాపార నిర్వహణ సౌలభ్యంకు ఎలాంటి ఆటంకం కలగకుండా, ఆదాయ వనరుల గండిని పూడ్చడానికి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడానికి ప్రభుత్వం…

    వైద్య రంగంలో పరిశోధనలకు క్వాంటం వ్యాలీ సేవలు

    అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌వారం కీల‌క అప్ డేట్ ఇచ్చారు. వైద్య రంగానికి సంబంధించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సదుపాయాలను తీసుకు రావటమే ఈ ఒప్పందం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *