బ‌ళ్లారి హింస్మాత్మ‌క ఘ‌ట‌న‌లో 11 మందిపై కేసు

ఎమ్మెల్యే గాలి జ‌నార్ద‌న్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీ‌రాములుపై

క‌ర్ణాట‌క : బ‌ళ్లారి లో చోటు చేసుకున్న హింసాత్మ‌క ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. వాల్మీకికి సంబంధించి బ్యాన‌ర్ల ఏర్పాటు పై గంగావ‌తి ఎమ్మెల్యే గాలి జ‌నార్ద‌న్ రెడ్డి, బ‌ళ్లారి ఎమ్మెల్యే నారా భ‌ర‌త్ రెడ్డి వ‌ర్గీయుల మ‌ధ్య తీవ్ర వాగ్వావాదం చోటు చేసుకుంది. దీంతో తీవ్ర ఉద్రిక్త‌త చివ‌ర‌కు కాల్పుల‌కు దారి తీసింది. ఈ ఘ‌ట‌న‌లో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక‌రు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు రంగంలోకి దిగ‌డంతో ప‌రిస్థితి అదుపులోకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం బ‌ళ్లారిలో ప‌చ్చ గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేలా ఉంది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి శుక్ర‌వారం పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఈ ఘ‌ట‌న‌లో మొత్తం 11 మందిపై కేసు న‌మోదు చేసిన‌ట్లు తెలిపారు.

వారిలో ప్ర‌స్తుత ఎమ్మెల్యే బీజేపీకి చెందిన గాలి జ‌నార్ద‌న్ రెడ్డి, మాజీ మంత్రి బి. శ్రీ‌రాములుతో పాటు మ‌రికొంద‌రిపై కేసు న‌మోదు చేశామ‌న్నారు. ఇదిలా ఉండ‌గా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు విజ‌యేంద్ర సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. బ‌ళ్లారి ఘ‌ట‌న వెనుక కాంగ్రెస్ పార్టీ హ‌స్తం ఉంద‌ని మండిప‌డ్డారు. హైకోర్టుకు చెందిన న్యాయ‌మూర్తితో విచార‌ణ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు. కావాల‌ని రాజ‌కీయ ప‌రంగా డ్యామేజ్ చేసేందుకు ప్ర‌తిప‌క్షం లేకుండా చేసేందుకు కాంగ్రెస్ స‌ర్కార్ కుట్ర‌కు తెర లేపింద‌న్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డ‌ర్ గ‌తి త‌ప్పింద‌న్నారు. త‌మ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, మాజీ మంత్రితో పాటు సీనియ‌ర్ల‌కు భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని కోరారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *