ఏపీలో నేత‌న్న‌ల‌కు స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్

రూ. 5 కోట్ల బ‌కాయిలు విడుద‌ల ఖాతాల్లో జ‌మ‌

అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ సంక్రాంతి శుభ వేళ తీపి క‌బురు చెప్పింది. ఈ మేర‌కు చేనేత‌న్న‌ల‌కు రావాల్సిన బ‌కాయిల‌ను విడుద‌ల చేసింది. ఈ మేర‌కు అధికారికంగా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. ఇందులో భాగంగా రూ. 5 కోట్లు విడుద‌ల చేశామ‌న్నారు. సోమ‌వారం నేత‌న్న‌ల ఖాతాల్లో నేరుగా జ‌మ చేశామ‌ని తెలిపారు. త‌మ స‌ర్కార్ నేత‌న్న‌ల సంక్షేమం కోసం కృషి చేస్తోంద‌ని చెప్పారు. నేతన్నలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మరోవైపు చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. చేనేత ఉత్పత్తుల విక్రయాల పెంపుదలకు కో ఆప్టెక్స్, టాటా తనేరియా, ఆద్యం బిర్లా గ్రూప్ తో ఒప్పందాలు చేసుకున్నామన్నారు.

ముఖ్యంగా ఈ కామర్స్ లో దిగ్గజ సంస్థలైన ఫ్లిప్ కార్ట్, అమెజాన్, జియో మార్ట్, ఓఎన్డీసీ ద్వారా ఆన్ లైన్ లో చేనేత దుస్తుల అమ్మకాలను ప్రారంభించామన్నారు. నేటి తరం అభిరుచులకు అనుగుణంగా రెడీమేడ్ చేనేత వస్త్రాలను తయారు చేయించి, ఆప్కో షో రూమ్ లతో పాటు ఆన్ లైన్ లోనూ అమ్మకాలు చేస్తున్నామన్నారు మంత్రి స‌విత . నేత‌న్న‌ల‌కు రెడీమేడ్ దుస్తుల తయారీపై శిక్షణ సైతం అందజేస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా చేనేత అమ్మకాలు ఊపందుకున్నాయని సవిత తెలిపారు. సంక్రాంతి ముంగిట రూ.5 కోట్ల బకాయిల చెల్లింపు చేయడంపై చేనేత సహకార సంఘాల ప్రతినిధులు, నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబుకు, మంత్రి సవితకు ధన్యవాదాలు తెలియజేశారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *