రేవంత్ రెడ్డి నిర్వాకం తెలంగాణ‌కు శాపం

నిప్పులు చెరిగిన ప‌ల్లె ర‌వి కుమార్ గౌడ్

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత ప‌ల్లె ర‌వికుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిపై భ‌గ్గుమ‌న్నారు. తెలంగాణతో పాటు కేసీఆర్ ఆన‌వాళ్లు లేకుండా చేయాల‌ని సీఎం కంక‌ణం క‌ట్టుకున్నాడ‌ని, ఆయ‌న కుట్ర‌లు చెల్లుబాటు కావ‌న్నారు. ఇక్క‌డి ప్ర‌జ‌లు అత్యంత చైత‌న్య‌వంతం కలిగి ఉన్నార‌ని, చంద్ర‌బాబు, రేవంత్ రెడ్డి మోసాల‌ను గుర్తించార‌ని అన్నారు. రాచకొండ గురించి రేవంత్ రెడ్డికి ఏం తెలుసు అని ప్ర‌శ్నించారు. గురువారం ప‌ల్లె ర‌వి కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. రాచకొండ తెలంగాణ సాంస్కృతిక వైభవానికి చిహ్నంగా ఉంద‌న్నారు. రాచకొండ కోట పోరాటానికి, ధిక్కారానికి ప్ర‌తీక అని చెప్పారు. రాచకొండ చరిత్ర ప్రజలకు తెలియ చేయడానికి కేసీఆర్ పేరు పెట్టారని గుర్తు చేశారు.

రేవంత్ రెడ్డి కంటే అహంకారి ఎవరూ లేరన్నారు ప‌ల్లె ర‌వి కుమార్ గౌడ్. ఇక్క‌డి చ‌రిత్ర రేవంత్ కు తెలియ‌ద‌న్నారు. ఈ ఘ‌న‌మైన పోరాటంలో, చ‌రిత్ర‌లో ఏనాడూ సీఎం భాగ‌స్వామిగా లేడ‌ని అన్నారు. అది తెలుసుకుంటే మంచిద‌న్నారు. రాష్ట్రంలో లక్షకు పైగా జనాభా ఉన్న మండలం ఎక్కడా లేదని అన్నారు ప‌ల్లె ర‌వికుమార్ గౌడ్. విభజన చట్టంలో పదేళ్ల పాటు హైదరాబాద్ జిల్లా పరిధిని మార్చడానికి వీలు లేదని అన్నారు. ఏ జిల్లాను తగ్గించినా బిఆర్ఎస్ ఊరుకోదని వార్నింగ్ ఇచ్చారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో గందరగోళం ఏర్పడింద‌న్నారు. జిల్లాల సంఖ్యను తగ్గించం అని చెప్తూనే రేషనైలేషన్ చేస్తామని అంటున్నార‌ని పేర్కొన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *