గూగుల్ క్లౌడ్ సీఈఓ థామ‌స్ కురియ‌న్ తో బాబు భేటీ

ఏఐ డేటా సెంట‌ర్ కు సంబంధించిన విష‌యాల‌పై చ‌ర్చ

దావోస్ : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌కంగా మారారు దావోస్ లో జ‌రిగిన ప్ర‌పంచ ఆర్థిక స‌ద‌స్సులో. మంగ‌ళ‌వారం దావోస్‌లో గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ తో చ‌ర్చించారు. తిరిగి కలవడం నాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు . ఈ సందర్భంగా విశాఖపట్నంలోని గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు సంబంధించిన విషయాలపై విస్తృతంగా చ‌ర్చించిన‌ట్లు తెలిపారు సీఎం . ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడానికి దాని పనులను వేగవంతం చేయడం గురించి కూడా ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింద‌న్నారు. వ్యాపార కార్యకలాపాలను వేగవంతం చేయాలనే త‌మ‌ నిబద్ధతకు అనుగుణంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున పూర్తి మద్దతు ఉంటుందని మ‌రోసారి స్ప‌ష్టం చేసిన‌ట్లు చెప్పారు. .

ఇదే స‌మ‌యంలో ఆంధ్రప్రదేశ్‌లో సహకారాన్ని మరింతగా పెంచడం గురించి చర్చించడానికి వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ (WIPO) డైరెక్టర్ జనరల్ డారెన్ టాంగ్‌ను కలవడం ఆనందంగా ఉందన్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. ఐపీ వాల్యుయేషన్‌లో స్టార్టప్‌లకు శిక్షణ ఇవ్వడానికి అమరావతిలో WIPO–ఆంధ్ర ఐపీ అకాడమీని ఏర్పాటు చేయడం, ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన మిషన్‌కు మద్దతుగా WIPO GREENను ఏకీకృతం చేయడం పై దృష్టి సారించామ‌న్నారు. 2029 నాటికి అమరావతి , విశాఖపట్నంలను ప్రపంచంలోని అగ్రశ్రేణి ఇన్నోవేషన్ క్లస్టర్‌లలో ఉంచడానికి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌ను ఉపయోగించడం గురించి చ‌ర్చించామ‌న్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *