పోల‌వ‌రం ప్రాజెక్టును ప‌రిశీలించిన బృందం

కీల‌క సూచ‌న‌లు చేసిన బృందం స‌భ్యులు

అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న ప్రాజెక్టు పోల‌వ‌రం . ఇప్పటికే నిర్మాణాలు కొన‌సాగుతున్నాయి. సీఎం చంద్ర‌బాబు నాయుడు ఈ ప్రాజెక్టును త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని కంకణం క‌ట్టుకున్నారు. ఆయ‌న 2014లో సీఎంగా కొలువు తీరిన స‌మ‌యంలో దీనిపై ఫోక‌స్ పెట్టారు. ఆ త‌ర్వాత రాజ‌కీయ ప‌రిణామాలు మార‌డం, ప్ర‌భుత్వం కోల్పోవ‌డంతో వైసీపీ జ‌గ‌న్ స‌ర్కార్ అధికారంలోకి వ‌చ్చింది. దీంతో ఆనాటి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రెడ్డి దీనిని ప‌ట్టించు కోలేదు. తీవ్ర నిర్లక్ష్యం వ‌హించారు. తిరిగి ఏపీలో కూట‌మి స‌ర్కార్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం ప‌నులు వేగ‌వంతంగా జ‌రుగుతున్నాయి. ఆరు నూరైనా స‌రే పోల‌వ‌రం ప్రాజెక్టును నిర్మించాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నారు సీఎం.

ఇదిలా ఉండ‌గా గ‌త కొన్ని రోజులుగా విదేశీ నిపుణుల బృందం ఏపీలో ప‌ర్య‌టించింది. ఇందులో భాగంగా పోల‌వ‌రం ప్రాజెక్టును ప‌రిశీలించింది. కీల‌క సూచ‌న‌లు చేసింది. చివరి రోజు క్షేత్రస్థాయి పరిశీలనలో గ్యాప్ 1 లో తాము రెండో రోజు సూచించిన విధంగా గట్టి పరిచిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ తరువా ఆ మట్టిని తొలగించారు. మట్టి ఎలా గట్టి పడుతోంది, గట్టి పడిన తరువాత దాని స్థిరత్వం ఎలా ఉంది అనేది పరిశీలించారు. ఈ పరీక్ష అనంతరం ప్రాజెక్టులో నిర్మాణంలో ఉన్న వివిధ పనులను చూశారు. ఆ తరువాత మూడో రోజు తాము క్షేత్ర స్థాయిలో పరిశీలించిన అంశాలతో పాటు అన్ని పనులపై సమీక్షించారు. పోలవరం ప్రాజెక్టులో మూడు రోజులపాటు పర్యటించిన విదేశీ నిపుణులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు, రాష్ట్ర జలవనరుల శాఖ సలహాదారు వెంకటేశ్వర రావు ను ఈ ఎన్ సి నరసింహమూర్తి జ్ఞాపికతో పాటు శాలువాతో సత్కరించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *