రామ‌కృష్ణ మిష‌న్ ఆధ్వ‌ర్యంలో యువ స‌మ్మేళ‌నం

Spread the loveఫిబ్ర‌వ‌రి 1న వివేకానంద మానవ వికాస కేంద్రం సిద్దంవిజ‌య‌వాడ : రామ‌కృష్ణ మిష‌న్ ఆధ్వ‌ర్యంలో భారీ ఖ‌ర్చుతో విజ‌య‌వాడ‌లో అత్యాధునిక వ‌స‌తి సౌక‌ర్యాల‌తో వివేకానంద మాన‌వ వికాస కేంద్రం నిర్మించారు. ఫిబ్ర‌వ‌రి 1న మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు ప్రారంభిస్తార‌ని మిష‌న్ ప్ర‌తినిధి వెల్ల‌డించారు. ఉదయం 9 గం.లకు వివేకానంద మానవ వికాస భవన ప్రారంభోత్సవం జరుగుతుందన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కార్యక్రమం ఉదయం 10గం.లకు జ్యోతి ప్రజ్వలన, మూర్తి త్రయానికి పుష్పాంజలి, వేద…

newsseals-RamakrishnaMission
Spread the love

ఫిబ్ర‌వ‌రి 1న వివేకానంద మానవ వికాస కేంద్రం సిద్దం
విజ‌య‌వాడ : రామ‌కృష్ణ మిష‌న్ ఆధ్వ‌ర్యంలో భారీ ఖ‌ర్చుతో విజ‌య‌వాడ‌లో అత్యాధునిక వ‌స‌తి సౌక‌ర్యాల‌తో వివేకానంద మాన‌వ వికాస కేంద్రం నిర్మించారు. ఫిబ్ర‌వ‌రి 1న మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు ప్రారంభిస్తార‌ని మిష‌న్ ప్ర‌తినిధి వెల్ల‌డించారు. ఉదయం 9 గం.లకు వివేకానంద మానవ వికాస భవన ప్రారంభోత్సవం జరుగుతుందన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కార్యక్రమం ఉదయం 10గం.లకు జ్యోతి ప్రజ్వలన, మూర్తి త్రయానికి పుష్పాంజలి, వేద మంత్ర పఠనం, ప్రారంభ గీతంతో మొదలవుతుందన్నారు. అనంతరం సమావేశ కార్యక్రమాలన్నీ తుమ్మలపల్లి కళాక్షేత్రములో నిర్వహించనున్నట్లు స్వామీజీ తెలిపారు. అనంతరం పరమపూజ్య శ్రీమత్ స్వామి గౌతమానందజీ మహరాజ్ అనుగ్రహ భాషణం, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సందేశం, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు ప్రసంగం, పూజ్య స్వామి వినిశ్చిలానంద, స్వామి శశికాంత నంద, స్వామి హృదానంద, స్వామి శితికంఠానంద ప్రసంగాలతో కార్యక్రమం జరగనుందన్నారు.

మధ్యాహ్నం 2గం.లకు స‌యువ సమ్మేళనం’లో పాల్గొనే అవకాశాన్ని యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని రామకృష్ణ మిషన్ వెల్లడించింది. ఉపాధ్యాయులకు శిక్షణకు సంబంధించిన కార్యక్రమాలపై చర్చించనున్నారు. వివేకానంద యువ సమ్మేళనంలో హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద, కర్ణాటక గదగ్ రామకృష్ణ వివేకానంద ఆశ్రమ అధ్యక్షులు స్వామి నిర్భయానంద, కర్ణాటక తుంకూరు రామకృష్ణ వివేకానంద ఆశ్రమ అధ్యక్షులు స్వామి వీరేశానంద, కడప రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి అనుపమానంద ప్రసంగం, యువత ప్రశ్నలు- జవాబుల కార్యక్రమం ఉంటుందన్నారు.

సాయంత్రం 4.45 గం.లకు ప్రారంభమయ్యే స్వామి రంగనాథానంద స్మృతి సభలో విజయవాడ రామకృష్ణ మిషన్ పాఠశాల విద్యార్థులచే భజనలు, లఘునాటిక ప్రదర్శనలు, శాస్త్రీయ నృత్యం, కోలాటం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నట్లు తెలిపారు. శ్రీ పద్మావతి వెంకటేశ్వర ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా.చదలవాడ సుధ, డా.చదలవాడ నాగేశ్వరరావు ప్రసంగం, ఢిల్లీ రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి సర్వలోకానందజీ, చెన్నై రామకృష్ణ మఠం మేనేజర్ స్వామి రఘునాయకానంద ప్రసంగాలు ఉంటాయన్నారు. ఈ సన్నాహక ప్రెస్ మీట్ కార్యక్రమంలో జ్ఞానార్కనంద స్వామీజీ , రామకృష్ణ మిషన్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు సుధాకర్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports