చంద్ర‌బాబుపై కామెంట్స్ అంబ‌టి రాంబాబు అరెస్ట్

గుంటూరు జిల్లా న‌ల్ల‌పాడు పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లింపు

గుంటూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన మాజీ మంత్రి అంబ‌టి రాంబాబుపై హ‌త్యాయ‌త్నం జ‌రిగింది. తెలుగుదేశం పార్టీకి చెందిన నేత‌లు, కార్య‌క‌ర్త‌లు భారీ ఎత్తున దాడి చేసేందుకు ప్ర‌య‌త్నం చేశారు. దీంతో గుంటూరు జిల్లాలోని మంత్రి నివాసం వ‌ద్ద తీవ్ర ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. చివ‌ర‌కు ఆయ‌న‌పై దాడి చేసేందుకు య‌త్నించ‌డంతో పోలీసులు రంగంలోకి దిగారు. మ‌రో వైపు అంబ‌టి రాంబాబుకు చెందిన ఇంటిని, కారును ధ్వంసం చేశారు. నిప్పంటించారు అవి ప‌నికి రాకుండా పోయాయి. త‌న ఆఫీసులో ఫ‌ర్నీచ‌ర్ ను చింద‌ర వంద‌ర చేశారు.

దీంతో ఏం జ‌రుగుతుందో తెలియ‌ని ప‌రిస్థితి చోటు చేసుకుంది. చివ‌ర‌కు టీడీపీ శ్రేణుల దెబ్బ‌కు మాజీ మంత్రి అంబ‌టి రాంబాబుపై పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. ఆయ‌న‌పై రెండు కేసులు న‌మోద‌య్యాయి. అనంత‌రం భారీ పోలీసు భ‌ద్ర‌త మధ్య అర్ద‌రాత్రి అంబ‌టిని అదుపులోకి తీసుకున్నారు. ఆయ‌న‌ను త‌న ఇంటి నుంచి బ‌య‌ట‌కు తీసుకు వ‌చ్చేందుకు నానా తంటాలు ప‌డాల్సి వ‌చ్చింది. చివ‌ర‌కు భారీ భ‌ద్ర‌త మ‌ధ్య అంబ‌టి రాంబాబును న‌ల్ల‌పాడు పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించారు. ప్ర‌స్తుతం గుంటూరు జిల్లా అంత‌టా తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొంది.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *