అఖండ దీపాన్ని వెలిగించిన బండారు శ్రావ‌ణి శ్రీ‌

VijayaBhaskar · February 3, 2026
Spread the love

శ్రీ శ్రీ శ్రీ కొండమీదరాయుడు స్వామి వారి మహోత్సవం

అనంత‌పురం జిల్లా : ప్ర‌తి ఏటా నిర్వ‌హించే అనంత‌పురం జిల్లాలోని బుక్కరాయ సముద్రంలో శ్రీ శ్రీ శ్రీ కొండమీదరాయుడు స్వామి వారి మహోత్సవం అంగ రంగ వైభ‌వోపేతంగా జ‌రిగింది. సింగ‌న‌మ‌ల ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి శ్రీ త‌న కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ శ్రీ శ్రీ కొండమీదరాయుడు స్వామివారి అఖండ దీపాన్ని వెలిగించారు. ప్రతియేటా దక్షిణ భారతదేశంలో అరుణాచలంలో అఖండ దీపాన్ని వెలిగిస్తారు. అదే సాంప్రదాయాన్ని గతేడాది నుంచి బుక్కరాయ సముద్రం, దేవరకొండ పై స్వామి వారి అఖండ దీపాన్ని వెలిగించడం ఆనందంగా ఉందన్నారు ఈ సంద‌ర్బంగా ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి శ్రీ‌.

అదేవిధంగా భక్తి శ్రద్ధలతో స్వామి వారి పల్లకి సేవలో పాల్గొని దేవర కొండచుట్టు 3.5 కి.మీ పరిధిలో మొదటిసారిగా ప్రారంభించిన గిరిప్రదక్షణలో పాల్గొనడం పూర్వ జ‌న్మ సుకృతంగా తాను భావిస్తున్న‌ట్లు తెలిపారు బండారు శ్రావ‌ణి శ్రీ‌. శ్రీ శ్రీ శ్రీ కొండమీదరాయుడు స్వామి వారి కృప నియోజకవర్గ ప్రజలకు నిత్యం ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించిన‌ట్లు తెలిపారు. అంత‌కు ముందు
శ్రీ కొండమీద రాయుడు వెంకటరమణ స్వామి వారి రథోత్సవ కార్యక్రమం అంగ‌రంగ వైభ‌వోపేతంగా నిర్వ‌హించారు. భారీ ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భ‌క్తులు పాల్గొన్నారు.