మ‌హా శివ‌రాత్రికి టీటీడీ ఆల‌యాలు ముస్తాబు

స్ప‌ష్టం చేసిన తిరుప‌తి జిల్లా ఎస్పీ

తిరుప‌తి జిల్లా : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేపట్టాలనే ఉద్దేశంతో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సంద‌ర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టిటిడి ఎస్ఓ మురళీకృష్ణ, టిటిడి జేఈవో వీరబ్రహ్మం సంయుక్తంగా ఉన్నతాధికారులతో కలిసి కపిలతీర్థం, అనుబంధ ఆలయాలను పరిశీలించి ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అధికారులు ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీ నియంత్రణ, పార్కింగ్ సదుపాయాలు, ట్రాఫిక్ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, తాగునీరు, క్యూలైన్లు , ఇతర మౌలిక వసతులపై క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులకు తగిన సూచనలు ఇచ్చారు. అలాగే శ్రీనివాస మంగాపురం, గుడిమల్లం, తదితర ఆలయాలను కూడా సందర్శించి ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు.
మహాశివరాత్రి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశమున్నందున, అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు సురక్షితంగా, సౌకర్యవంతంగా దర్శనం కల్పించేందుకు తగిన చర్య‌లు తీసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు జేఈవో వీర‌బ్ర‌హ్మం.

  • Related Posts

    శ్రీ‌వారి ఉద్యోగులకు వెండి డాలర్‌, ప్రశంసా పత్రాలు

    తిరుపతి : తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్‌ మైదానంలో టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. భద్రతా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ…

    ఆగ‌స్టు 17 నుంచి ఆధ్యాత్మిక సేవ‌ల‌పై జాతీయ స‌ద‌స్సు

    తిరుపతి : తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ వైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. శ్రీ రామానుజులు, ఆచార్య పుండరీకాక్షులు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *