శివ స్వాముల కోసం స్పెష‌ల్ స‌ర్వీసులు

VijayaBhaskar · February 12, 2026
Spread the love

తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ ఎండీ

హైద‌రాబాద్ : మ‌హా శివ‌రాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ తీపి క‌బురు చెప్పింది స‌ర్కార్. భ‌క్తుల కోసం ఇబ్బందులు లేకుండా 2,432 స్పెష‌ల్ బ‌స్సులు న‌డుపుతామ‌ని తెలిపారు. ఈనెల 14 నుండి 16వ తేదీ వ‌ర‌కు ప్ర‌త్యేక బ‌స్సులు ఉంటాయ‌న్నారు. ఏడుపాయలకు తిరిగే స్పెషల్ బస్సుల్లో 15 వతేది నుంచి 17 తేది వరకు సవరణ చార్జీలు వర్తిస్తాయని తెలిపారు. ప్రయాణికులకు సమాచార నిమిత్తం స్పెషల్ సర్వీసులకు బస్సు ముందు భాగంలో డిస్ ప్లే బోర్డ్ లను సంస్థ ఏర్పాటు చేస్తుంద‌ని చెప్పారు ఎండీ నాగిరెడ్డి.

బ‌స్సుల ఏర్పాటుపై ఇప్ప‌టికే ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష చేప‌ట్ట‌డం జ‌రిగింద‌న్నారు. శివరాత్రి పండుగకు శైవక్షేత్రాలకు వెళ్లే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించిన‌ట్లు తెలిపారు. గత శివరాత్రి కన్నా ఈ సారి 208 బస్సులను అదనంగా న‌డిస్తున్నామ‌న్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా మరిన్ని ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని క్షేత్ర స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేయ‌డం జ‌రిగింద‌న్నారు. మహాశివరాత్రి స్పెషల్ బస్సుల్లో రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు రాష్ట్రంలో ప్రయాణానికి ఉచిత బస్సు రవాణా సదుపాయం యధావిధిగా అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. తమ ప్రయాణ సమయంలో మహిళలు విధిగా జీరో టికెట్లను తీసుకోవాలని సూచించారు.