సంజూ శాంస‌న్ పై ర‌విచంద్ర‌న్ అశ్విన్ కామెంట్స్

Spread the loveత‌ను సెంచ‌రీ చేస్తే చూడాల‌ని ఉంద‌న్న క్రికెట‌ర్ చెన్నై : భార‌త క్రికెట‌ర్, అనలిస్ట్ , పాడ్ కాస్ట‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ గురించి. తాజాగా భార‌త్ , శ్రీ‌లంక దేశాలు సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా న్యూఢిల్లీ వేదిక‌గా న‌మీబియాతో కీల‌క మ్యాచ్ జ‌రిగింది. త‌ను కేవ‌లం 8 బంతులు మాత్ర‌మే ఆడి 22 ర‌న్స్ చేశాడు. ఇదే…

newsseals-RAswin
Spread the love

త‌ను సెంచ‌రీ చేస్తే చూడాల‌ని ఉంద‌న్న క్రికెట‌ర్

చెన్నై : భార‌త క్రికెట‌ర్, అనలిస్ట్ , పాడ్ కాస్ట‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ గురించి. తాజాగా భార‌త్ , శ్రీ‌లంక దేశాలు సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా న్యూఢిల్లీ వేదిక‌గా న‌మీబియాతో కీల‌క మ్యాచ్ జ‌రిగింది. త‌ను కేవ‌లం 8 బంతులు మాత్ర‌మే ఆడి 22 ర‌న్స్ చేశాడు. ఇదే మ్యాచ్ లో ఇషాన్ కిష‌న్ , పాండ్యా, శివ‌మ్ దూబేలు దుమ్ము రేపారు. ఆ త‌ర్వాత భార‌త్ జ‌ట్టు బౌల‌ర్లు అద్భుతంగా బౌలింగ్ చేయ‌డంతో ఇండియా గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది. కాగా శాంస‌న్ కు అనూహ్యంగా ఛాన్స్ ద‌క్కింది. త‌ను స్వ‌దేశంలో జ‌రిగిన న్యూజిలాండ్ టి20 సీరీస్ లో 5 మ్యాచ్ లు ఆడాడు . కేవ‌లం 50 ర‌న్స్ మాత్ర‌మే చేశాడు.

దీంతో త‌న‌ను పూర్తిగా త‌ప్పించాడు హెడ్ కోచ్ గంభీర్. తొలి మ్యాచ్ భార‌త జ‌ట్టు అమెరికాతో త‌ల‌ప‌డింది. అభిషేక్ శ‌ర్మ ఆశించిన మేర ఆడ‌లేదు. ఇండియా 9 వికెట్లు కోల్పోయి 161 ర‌న్స్ చేసింది. ముప్పు తిప్ప‌లు పెట్టింది ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు. కెప్టెన్ సూర్య దుమ్ము రేపాడు. ఎట్ట‌కేల‌కు ఇండియా 24 ర‌న్స్ తో గెలుపొందింది. ఈ త‌రుణంలో అభిషేక్ శ‌ర్మ గాయ‌ప‌డ‌డంతో రెండో మ్యాచ్ లో సంజూ శాంస‌న్ కు ఛాన్స్ ద‌క్కింది. దీనిపై స్పందించాడు ర‌విచంద్ర‌న్ అశ్విన్. త‌ను టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో సెంచ‌రీ చేస్తే చూడాల‌ని ఉంద‌న్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports