వ్యాఘ్ర వాహనంపై సోమస్కందమూర్తి

శ్రీ క‌పిలేశ్వ‌ర స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు

తిరుపతి : తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా జ‌రుగుతున్నాయి. శ్రీ సోమస్కంధ మూర్తి వ్యాఘ్ర వాహనంపై అనుగ్రహించారు. భజన మండళ్ల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తి వ్యాఘ్రం వంటిది. భక్తితో ఏ జీవుడి హృదయం శివునికి వేదికవుతుందో ఆ జీవుడి క్రూరపాపకర్మలు, మదమోహ, మాత్సర్యాదులు సంహరించబడతాయి. వాహ‌న సేవ‌లో ఆలయ సూపరింటెండెంట్ చంద్ర‌శేఖ‌ర్‌, ఆల‌య అర్చ‌కులు విశేష‌ సంఖ్య‌లో గా భక్తులు పాల్గొన్నారు.

ఇదిలా ఉండ‌గా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈనెల 16వ తేదీ వ‌ర‌కు శ్రీ క‌పిలేశ్వ‌ర స్వామి వారి బ్ర‌హ్మోత్స‌వాలు కొన‌సాగ‌నున్నాయి. శ్రీ‌వారి భ‌క్తుల‌కు సంబంధించి రుచిక‌ర‌మైన అన్న ప్ర‌సాదం ఏర్పాటు చేసింది. సుదూర ప్రాంతాల నుంచి వ‌చ్చిన భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చ‌ర్య‌లు చేప‌ట్టింది. ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశారు జిల్లా పోలీసులు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బా రాయుడు ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున చ‌ర్య‌లు చేప‌ట్టారు.

  • Related Posts

    శ్రీ‌వారి ఉద్యోగులకు వెండి డాలర్‌, ప్రశంసా పత్రాలు

    తిరుపతి : తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్‌ మైదానంలో టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. భద్రతా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ…

    ఆగ‌స్టు 17 నుంచి ఆధ్యాత్మిక సేవ‌ల‌పై జాతీయ స‌ద‌స్సు

    తిరుపతి : తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ వైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. శ్రీ రామానుజులు, ఆచార్య పుండరీకాక్షులు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *