6 వేల అంగ‌న్వాడీ కేంద్రాల భ‌వ‌నాల నిర్మాణం

ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి శ్రీ కామెంట్స్

అనంత‌పురం జిల్లా : గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో అసంపూర్తిగా ఉన్న అంగ‌న్ వాడి కేంద్రాల‌ను పునః ప్రారంభించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి శ్రీ‌. కొత్త భవనాల ఏర్పాటు కు నిధులు మంజూరు చేయాలని ఇవాళ జ‌రిగిన శాస‌న స‌భ‌లో కోరారు. 2014-2019 మధ్యకాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా మంత్రి లోకేష్ చొరవతో రాష్ట్ర వ్యాప్తంగా 6000 అంగన్వాడీ కేంద్రాల భవనాలు నిర్మించడం జరిగిందన్నారు. అయితే గత వైసీపీ ప్రభుత్వ వైఫల్యం వల్ల కొత్తవి కట్ట లేద‌ని ఆరోపించారు. అద్దె భవనాల్లో ఉన్న అంగన్వాడీలకు కిరాయిలు చెల్లించ లేద‌న్నారు. కనీసం చిన్న మరమ్మతు పనులు చేపట్టలేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు, నాడు-నేడు పనులని చెప్పి, నిర్మాణాలు పూర్తి చేయకుండా, జేబులు నింపుకొని, అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేశారని ధ్వ‌జ‌మెత్తారు.

పేద కుటుంబాల నుంచి వచ్చిన అంగన్వాడీలకు గత వైసీపీ హ‌యంలో ప్రభుత్వ పథకాలను తీసేశారని ఆరోపించారు, అంగన్వాడీలకు జీతాలు కూడా పెంచకుండా ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. శింగనమల నియోజకవర్గ పరిధిలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు 22 అంగన్వాడీ కేంద్ర భవనాలు అసంపూర్తిగా నిలిపి వేశారని అన్నారు. వసతులు లేని భవనాల్లో ఉన్న అంగన్వాడీ లను ఎప్పుడూ ఖాళీ చేయమంటారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. అసంపూర్తిగా నిలిచి పోయిన అంగన్వాడీ భవనాల పనులు పునః ప్రారంభించేందుకు, అలాగే కొత్త అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని కోరారు బండారు శ్రావ‌ణి శ్రీ‌. విద్యా శాఖ మంత్రి లోకేష్ చొరవతో అంగన్వాడీ ని ఫ్రీ స్కూలుగా తీసుకు రావడం చాలా సంతోషంగా ఉందిన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *