అంగ‌రంగ వైభ‌వోగం క్షేత్రపాలకుడికి అభిషేకం

త‌ర‌లి వ‌చ్చిన భ‌క్త బాంధ‌వులు

తిరుమల : తిరుమలలోని గోగర్భం సమీపంలో గల రుద్రుని రూపమైన క్షేత్ర పాలకుడికి ఆదివారం వేడుకగా అభిషేకం జరిగింది. తిరుమల క్షేత్రానికి పాలకునిగా ఉన్న రుద్రునికి మహా శివరాత్రి సందర్భంగా ప్రతి ఏటా అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం నుండి ఆలయ మర్యాదలతో అధికారులు, అర్చకులు క్షేత్రపాలక శిల వద్దకు చేరుకున్నారు. పాలు, పెరుగు, చందనం, పన్నీరు, కొబ్బరినీళ్లు తదితర ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఆ తర్వాత నైవేద్యం సమర్పించారు. భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.

ఇదిలా ఉండ‌గా టీటీడీ ఆధ్వ‌ర్యంలో మ‌హా శివ‌రాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముంద‌స్తుగా భ‌ద్ర‌త‌ను క‌ల్పించారు. తిరుప‌తి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున పోలీసుల‌ను మోహ‌రించారు. అన్న ప్ర‌సాద విత‌ర‌ణ చేప‌ట్టారు. భ‌క్తులు సంతృప్తిని వ్య‌క్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

  • Related Posts

    శ్రీ‌వారి ఉద్యోగులకు వెండి డాలర్‌, ప్రశంసా పత్రాలు

    తిరుపతి : తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్‌ మైదానంలో టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. భద్రతా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ…

    ఆగ‌స్టు 17 నుంచి ఆధ్యాత్మిక సేవ‌ల‌పై జాతీయ స‌ద‌స్సు

    తిరుపతి : తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ వైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. శ్రీ రామానుజులు, ఆచార్య పుండరీకాక్షులు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *