అభిషేక్ శర్మ‌పై మ‌హ‌మ్మ‌ద్ అమీర్ కామెంట్స్

నేను ఇండియా టీంకు శ‌త్రువును కాదు

పాకిస్తాన్ : స్టార్ బౌల‌ర్ మ‌హ‌మ్మ‌ద్ అమీర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇటీవ‌ల ప‌రుగుల వ‌ర‌ద పారిస్తూ రికార్డులను బ్రేక్ చేసిన ఇండియాకు చెందిన అభిషేక్ శ‌ర్మ ఉన్న‌ట్టుండి ఐసీసీ టి20 టోర్నీలో పేల‌వ‌మైన ఆట తీరుతో నిరాశ ప‌రిచాడు. దీనిపై తీవ్రంగా స్పందించాడు అమీర్. నేను భారతదేశానికి శత్రువును కాదు. నిజానికి, పాకిస్తాన్ కంటే భారతదేశ మ్యాచ్‌లను చూడటం నాకు చాలా ఇష్టం అని చెప్పాడు. భారతదేశం ఓడిపోయినప్పుడు నాకు బాధగా ఉంటుందని చెప్పాడు. రెండు డకౌట్‌లకు అవుట్ అయిన తర్వాత కూడా, అభిషేక్ శర్మ నిర్భయమైన విధానాన్ని నేను ప్రశంసించానని తెలిపాడు.

కానీ సీనియర్ ఆటగాడిగా, అంతర్జాతీయ క్రికెట్ మీ బలహీనతలను బహిర్గతం చేస్తుందని నా ఉద్దేశ్యం. అతను తన టెక్నిక్‌పై మరింత పని చేయడానికి అవసరమైన నైపుణ్యాలను కలిగి ఉన్నాడని ప్ర‌శంస‌లు కురిపించాడు బౌల‌ర్ మ‌హ‌మ్మ‌ద్ అమీర్. ప్రతి బంతిలోనూ స్వింగ్ చేయడం అతని కెరీర్‌ను తగ్గించగలదని సూచించాడు. తాజాగా అమీర్ శ‌ర్మ గురించి చేసిన కామెంట్స్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

  • Related Posts

    ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడేది క‌ష్ట‌మే ..?

    చెన్నై : అంద‌రి క‌ళ్లు మ‌హేంద్ర సింగ్ ధోనీపై ఉన్నాయి. ఈ ఏడాది 2026లో జ‌రిగిన ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించ‌లేదు సీఎస్కే జ‌ట్టు. నిరాశజనకమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరలేక పోయింది, ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి…

    ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు

    ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో తొలిసారిగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేద‌న్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *