టీమిండియాను ఓడించి తీరుతాం : సికింద‌ర్

జింబాబ్వే కెప్టెన్ షాకింగ్ కామెంట్స్

చెన్నై : ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో అత్యంత కీల‌క‌మైన మ్యాచ్ కు వేదిక కానుంది త‌మిళ‌నాడు రాష్ట్ర రాజ‌ధాని చెన్నై. ఇవాళ భార‌త జ‌ట్టు జింబాబ్వేతో త‌ల‌ప‌డ‌నుంది. ఇప్ప‌టికే భార‌త జ‌ట్టు సూప‌ర్ -8 లో భాగంగా జ‌రిగిన మ్యాచ్ లో ఊహంచ‌ని రీతిలో ద‌క్షిణాఫ్రికా చేతిలో దారుణంగా 67 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. దీంతో డిఫెండింగ్ ఛాంపియ‌న్ గా ఉన్న సూర్య కుమార్ యాద‌వ్ నేతృత్వంలోని టీమిండియాపై తీవ్ర‌మైన ఒత్తిడి నెల‌కొంది. ఇప్ప‌టికే ఆశించిన మేర ఆట‌గాళ్ల ప్ర‌ద‌ర్శ‌న ఉండ‌క పోవ‌డంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశ‌కు గుర‌వుతున్నారు. ఇండియా ఇంకా రెండు కీల‌క మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.

ప్ర‌స్తుతం ఇవాళ జింబాబ్వేతో త‌ల‌ప‌డ‌నుండ‌గా మ‌రో మ్యాచ్ వెస్టిండీస్ తో త‌ల‌ప‌డాల్సి ఉంది . ఇదిలా ఉండ‌గా భార‌త్ తో జ‌రిగే మ్యాచ్ గురించి స్పందించాడు జింబాబ్వే జ‌ట్టు కెప్టెన్ సికింద‌ర్ రజా.
భారతదేశం ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ జట్లలో ఒకటి, దాని గురించి ఎటువంటి సందేహం లేదు. స్వదేశంలో భారత్‌ను ఓడించడం చాలా కఠినమైన పని. అయినప్పటికీ, భారతదేశం ప్రస్తుతం కొంత ఒత్తిడిలో ఉంది. మేము భార‌త జ‌ట్టును ఓడించడానికి సిద్ధంగా ఉన్నామంటూ ప్ర‌క‌టించాడు. మా జ‌ట్టు ఆట‌గాళ్లు త‌ల‌ప‌డేందుకు రెడీగా ఉన్నారంటూ స్ప‌ష్టం చేశాడు సికింద‌ర్ ర‌జా.

  • Related Posts

    ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడేది క‌ష్ట‌మే ..?

    చెన్నై : అంద‌రి క‌ళ్లు మ‌హేంద్ర సింగ్ ధోనీపై ఉన్నాయి. ఈ ఏడాది 2026లో జ‌రిగిన ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించ‌లేదు సీఎస్కే జ‌ట్టు. నిరాశజనకమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరలేక పోయింది, ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి…

    ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు

    ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో తొలిసారిగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేద‌న్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *