సంజు శాంస‌న్ అద్భుతంగా ఆడాడు

జ‌ట్టుకు కావాల్సింది త‌న నుంచి ఇదే

చెన్నై : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా త‌మిళ‌నాడు రాష్ట్ర రాజ‌ధాని చెన్నై వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్ లో అద్భుత‌మైన ఆట తీరును ప్ర‌ద‌ర్శించింది భార‌త జ‌ట్టు. డిఫెండింగ్ ఛాంపియ‌న్ గా ఉన్న టీమిండియా ప్ర‌స్తుతం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. సెమీ ఫైన‌ల్ కు చేరాలంటే త‌ప్ప‌నిస‌రిగా జింబాబ్వేతో పాటు వెస్టిండీస్ మ‌ధ్య ఆడాల్సి ఉంది. దీంతో చావో రేవో తేల్చుకునేందుకు రెడీ అయ్యింది. ఆట తీరుతో ఆక‌ట్టుకుంది. నిన్న‌టి దాకా ఆయా మ్యాచ్ ల‌లో ఆడ‌కుండా ప‌క్క‌న పెట్టిన సంజూ శాంసన్ ను జింబాబ్వేతో జ‌రిగిన మ్యాచ్ లో తీసుకున్నారు. టీం ఇండియా తొలుత బ్యాటింగ్ కు దిగింది. పొట్టి ఫార్మాట్ లో భారీ స్కోర్ సాధించి రికార్డు న‌మోదు చేసింది. కేవ‌లం 4 వికెట్లు కోల్పోయి 256 ప‌రుగులు చేసింది టీంఇండియా.

సంజూ శాంస‌న్ 24 ర‌న్స్ చేస్తే, అభిషేక్ శ‌ర్మ 55, సూర్య కుమార్ యాద‌వ్ 38, ఇసాన్ కిష‌న్ 28, తిల‌క్ వ‌ర్మ 44 , హార్దిక్ పాండ్యా 50 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచారు. అనంత‌రం బ‌రిలోకి దిగిన జింబాబ్వే ఆశించిన మేర ఎదుర్కోలేక పోయింది భార‌త బౌల‌ర్ల‌ను. మ్యాచ్ ముగిశాక కామెంటేట‌ర్ , మాజీ క్రికెట‌ర్ దినేష్ కార్తీక్ మీడియాతో మాట్లాడారు. త‌ను ప్ర‌త్యేకించి సంజు శాంస‌న్ గురించి ప్ర‌స్తావించాడు. సంజు సామ్సన్ జట్టు తన నుండి ఆశించిన విధంగానే ఆడాడు. అతను జట్టును అద్భుతంగా ప్రారంభించాడు, అభిషేక్ పై ఒత్తిడిని తగ్గించాడు .అవసరమైన రిస్క్‌లు తీసుకున్నాడు. అయితే మీరు రిస్క్‌లు తీసుకున్నప్పుడు, కొన్నిసార్లు తప్పులు చేయడం ఖాయం అన్నాడు.

క్రికెట్ నిపుణులు చివరకు సంజును అభినందిస్తున్నట్లు చూడటం మంచిది. అతను జట్టు అతని నుండి ఏమి అడిగిందో ఖచ్చితంగా అందించాడు. జట్టు కోసం తన పాత్రను అద్భుతంగా పోషించాడు

  • Related Posts

    ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడేది క‌ష్ట‌మే ..?

    చెన్నై : అంద‌రి క‌ళ్లు మ‌హేంద్ర సింగ్ ధోనీపై ఉన్నాయి. ఈ ఏడాది 2026లో జ‌రిగిన ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించ‌లేదు సీఎస్కే జ‌ట్టు. నిరాశజనకమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరలేక పోయింది, ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి…

    ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు

    ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో తొలిసారిగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేద‌న్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *