జ‌ర్న‌లిస్ట్స్ కోఆప‌రేటివ్ హౌసింగ్ సొసైటీ డైరీ ఆవిష్క‌ర‌ణ‌

విడుద‌ల చేసిన మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైద‌రాబాద్ : హైదరాబాద్‌లోని ది జర్నలిస్ట్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ (JCHSL) రూపొందించిన 2026 డైరీని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు తన చాంబర్‌లో ఆవిష్కరించారు.1960లో స్థాపించబడిన ఈ చారిత్రాత్మక సొసైటీ తరఫున సభ్యుల వివరాలు, కాలనీల చరిత్ర, మీడియా సంబంధిత సమాచారంతో కూడిన డైరీని మొదటిసారిగా రూపొందించామని సొసైటీ అధ్యక్షుడు బ్రహ్మాండబేరి గోపరాజు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మేనేజింగ్ కమిటీ సభ్యులు మంత్రిని శాలువాలతో సత్కరించగా, మంత్రి సొసైటీకి, సభ్యులకు అభినందనలు తెలిపారు.

ఈ సంద‌ర్బంగా మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి జ‌ర్న‌లిస్టుల‌తో చాలా సేపు చ‌ర్చించారు. వివిధ స‌మ‌స్య‌ల గురించి ఆరా తీశారు. త‌మ కూట‌మి ప్ర‌భుత్వం జ‌ర్న‌లిస్టుల‌కు అండ‌గా ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. త్వ‌ర‌లోనే అంద‌రికీ ఇళ్ల స్థ‌లాలు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మిక్కిలినేని రవీంద్రబాబు, వైస్ ప్రెసిడెంట్ మసాదే లక్ష్మీనారాయణ, జాయింట్ సెక్రటరీ డా. చల్లా భాగ్యలక్ష్మి, ట్రెజరర్ భీమగాని మహేష్, డైరెక్టర్లు డి. కమలాకరాచార్య , ఎం.ఎస్.హెచ్. హాష్మీ పాల్గొన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *