టిటిడి ఆధీనంలోకి శ్రీ అభయ అనుగ్రహ ఆల‌యం

ఆల‌య అధికారుల‌కు అంద‌జేసిన రికార్డులు

తిరుపతి : తిరుప‌తి జిల్లా నాయుడుపేట మండలం తిమ్మజికండ్రిగ గ్రామంలోని శ్రీ అభయ అనుగ్రహ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయాన్ని టిటిడిలోకి విలీనం చేసుకునే కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఆల‌య ధ‌ర్మ‌క‌ర్త కే. నరసింగా రావు, గ్రామస్థులు ఆల‌యానికి సంబంధించిన రికార్డుల‌ను టీటీడీ అధికారులకు అందించారు. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆల‌య స‌ముదాయంలో ఈ ఆల‌యాన్ని చేర్చారు.

ఈ సంద‌ర్బంగా టీటీడీ నుంచి అన్ని వ‌స‌తులు, సౌక‌ర్యాలు క‌ల్పించ‌డం జ‌రుగుతుంద‌న్నారు టీటీడీ సూప‌రింటెండెంట్ జ్ఞాన ప్ర‌కాశ్. ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది భ‌క్తులు శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారిని కొలుస్తున్నార‌ని, త‌మ కోరిక‌లు తీరిన వెంట‌నే విరాళాలు పెద్ద ఎత్తున ఇస్తున్నార‌ని తెలిపారు. ఆల‌యాల‌ను స్వాధీనం చేసేందుకు వ‌చ్చే వారికి టీటీడీ మ‌ద్ద‌తు ఇస్తుంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడికి చెందిన ఉద్యోగులు ముని కుమార్, రాజేష్, మహేష్, రవికుమార్ రెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

  • Related Posts

    శ్రీ‌వారి ఉద్యోగులకు వెండి డాలర్‌, ప్రశంసా పత్రాలు

    తిరుపతి : తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్‌ మైదానంలో టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. భద్రతా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ…

    ఆగ‌స్టు 17 నుంచి ఆధ్యాత్మిక సేవ‌ల‌పై జాతీయ స‌ద‌స్సు

    తిరుపతి : తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ వైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. శ్రీ రామానుజులు, ఆచార్య పుండరీకాక్షులు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *