ఎర్ర బుక్కులో జ‌గ‌న్ పేరు రాస్తే నీకే ప్ర‌మాదం

మంత్రి నారా లోకేష్ ను హెచ్చ‌రించిన కొడాలి నాని

బెజ‌వాడ : మాజీ మంత్రి కొడాలి నాని నిప్పులు చెరిగారు. గ‌త కొంత కాలంగా మౌనంగా ఉంటూ వ‌చ్చిన త‌ను ఉన్న‌ట్టుండి బ‌య‌ట‌కు వ‌చ్చారు. రాష్ట్రంలో ప్ర‌జా ప్ర‌భుత్వం పేరుతో దోపిడీ రాజ్యం న‌డుస్తోంద‌ని, అరాచ‌క పాల‌న సాగుతోంద‌ని ఆరోపించారు. మొన్న అంబటి రాంబాబు ఇంట్రడక్షన్ అయి పోయింది. ఇప్పుడు కొడాలి నాని ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఎంట్రీ ఎన్నడు మామూలుగా ఉండదు. ఇప్పుడు అలాగే చాలా గ్రాండ్ గా ఉంది.

కొడాలి నాని మీడియా ముందుకు వస్తూనే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు . మీ ఎర్ర బుక్కులు, కేసులు, అరెస్టులు, జైలు చూసి భయపడి వైసీపీలో ఎవరు రాజకీయాలు వదిలి పారిపోలేద‌ని అన్నారు. అందరం ఇక్కడే ఉన్నాం. జగన్ వెంటే ఉన్నాం. అంబటి రాంబాబుని జైల్లో పెట్టి కేవలం 18 రోజులలోనే మీరే హీరోని చేశారంటూ ఎద్దేవా చేశారు. లోకేష్ నీ బుక్ లో జగన్ పేరు వ్రాసుకున్నా లేదా జగన్ నీ గురించి తలుచుకున్నా నీకే ప్రమాదం తెలుసుకో అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇది మీ బాలకృష్ణ డైలాగే నాది కాద‌న్నారు నాని. నా సంగతి మర్చిపోయావా నారా లోకేష్? అని కొడాలి నాని అని స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *