భక్తుల లగేజి కౌంటర్‌ను పరిశీలించిన ఈవో

ఈవోకు వివ‌రించిన కౌంట‌ర్ సిబ్బంది

తిరుపతి : తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు అలిపిరి వద్ద ఏర్పాటు చేసిన లగేజి డిపాజిట్ కౌంటర్ పని తీరును టీటీడీ ఈవో ఎం. రవిచంద్ర పరిశీలించారు. టిటిడి సివిఎస్వో కేవీ మురళీకృష్ణ తో కలిసి ఈవో తనిఖీలు నిర్వహించారు. భక్తులు అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లే సమయంలో తమ లగేజిని కౌంటర్‌లో డిపాజిట్ చేయగా, వాటిని భద్రంగా తిరుమలకు తరలించే విధానంపై అధికారులు ఈవోకు వివరించారు. లగేజి డిపాజిట్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా రూపొందే క్యూఆర్ కోడ్‌తో కూడిన రసీదు భక్తులకు అందజేస్తున్నట్లు తెలిపారు.

సాధారణ రోజుల్లో సుమారు 6 వేల బ్యాగులు, ప్రత్యేక పర్వదినాల్లో 10 వేల వరకు బ్యాగులు తిరుమలకు భద్రంగా రవాణా చేస్తున్నట్లు ఈవోకు వివరించారు. అనంతరం ఈవో లగేజి కౌంటర్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో అలిపిరి ఏవిఎస్వో రమేష్ కృష్ణన్ , ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

  • Related Posts

    శ్రీ‌వారి ఉద్యోగులకు వెండి డాలర్‌, ప్రశంసా పత్రాలు

    తిరుపతి : తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్‌ మైదానంలో టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. భద్రతా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ…

    ఆగ‌స్టు 17 నుంచి ఆధ్యాత్మిక సేవ‌ల‌పై జాతీయ స‌ద‌స్సు

    తిరుపతి : తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ వైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. శ్రీ రామానుజులు, ఆచార్య పుండరీకాక్షులు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *