ధురంధర్ వెనుక అదృశ్య శ‌క్తి స్టూవర్ట్ బిన్నీ

అవును మీరు విన్నది నిజమే ..వాస్త‌వ‌మే

ఢిల్లీ : ఎవ‌రీ స్టువ‌ర్ట్ బిన్నీ అనుకుంటున్నారా. భార‌త దేశ క్రికెట్ రంగంలో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన క్రికెట‌ర్. అంతే కాదు ఆల్ రౌండ‌ర్ గా గుర్తింపు పొందాడు. హ‌ర్యానా హ‌రికేన్ క‌పిల్ దేవ్ నిఖంజ్ సార‌థ్యంలో 1983లో ప్ర‌పంచ క‌ప్ ను గెలుచుకున్న జ‌ట్టులో త‌ను కూడా ఒక‌డు. బీసీసీఐ తాజాగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. క్రికెట్ కు జీవం పోసిన క‌ల్న‌ల్ సీకే నాయుడు పేరుతో ఏర్పాటు చేసిన పుర‌స్కారానికి బిన్నీని ఎంపిక చేసింది. ఢిల్లీలో జ‌రిగిన న‌మాన్ అవార్డుల ప్ర‌దానోత్స‌వంలో బిన్నీ దీనిని అందుకున్నారు. ఇదే స‌మ‌యంలో ఆయ‌న సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారారు.

దీనికి ప్ర‌ధాన కార‌ణం ఏమిటంటే ఇవాళ ప్ర‌పంచ సినీ రంగంలో సెన్సేషన్ క్రియేట్ చేసింది ఓ మూవీ. అదే దురంధ‌ర్. ఈ సినిమాను ఆదిత్య ధ‌ర్ తీశాడు. ఇప్ప‌టికే రూ. 1000 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ప్ర‌స్తుతం తెలుగులో కూడా విడుద‌లైంది. ఇక్క‌డ కూడా ధురంధ‌ర్ ను ఆద‌రిస్తున్నారు. అయితే ఈ సినిమాను తీసిన ద‌ర్శ‌కుడు ఆదిత్య ధ‌ర్ స్వ‌యంగా ప్రొఫెష‌న‌ల్ క్రికెట‌ర్ . అతను 2002 అండర్ 19 ప్రపంచ కప్‌లో చోటు సంపాదించాడు. ఆదిత్య ధార్ రాజకీయాల కారణంగా క్రికెట్‌ను వదిలి ముంబైకి సినిమా నిర్మాణం కోసం వెళ్లాడు. త‌న‌ను తాను ఏమిటో నిరూపించుకున్నాడు.

  • Related Posts

    పాన్ మ‌సాలా ప్ర‌చారంపై బాలీవుడ్ న‌టుల‌కు నోటీసులు

    ముంబై : విమల్ యాలాకుల‌ ప్రకటనకు సంబంధించి నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్‌గన్ , టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఎఫ్‌డిఎ షో-కాజ్ నోటీసు జారీ చేసింది. ఈ ప్రకటన ప్రాథమికంగా నిషేధిత పాన్ మసాలా , పొగాకు సంబంధిత ఉత్పత్తుల…

    జై శ్రీ‌రామ్ పేరుతో దాడులు చేస్తే ఎలా..?

    హైద‌రాబాద్ : న‌టి అన‌సూయ భ‌ర‌ద్వాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె తాజాగా హిందూ సంస్థ‌ల‌ను టార్గెట్ చేశారు. మ‌రో వివాదానికి తెర తీశారు. ప్ర‌స్తుతం దేశంలో హిందూ సంస్థ‌ల హ‌వా కొన‌సాగుతోంది. ‘జై శ్రీరామ్’ నినాదాలపై అనసూయ సంచలన వ్యాఖ్యలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *