ప‌రాభావ నామ ఏడాది అంద‌రికీ మేలు జ‌ర‌గాలి

సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న

అమ‌రావ‌తి : పరాభవ నామ సంవత్సరం ప్రజలందరికీ మంచి చేయాలని ఆకాంక్షించారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియ చేశారు. పరాభవ నామసంవత్సరం ప్రజలందరికీ మంచి చేయాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు సీఎం . ఉగాది పచ్చడి మన జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. పులుపు, తీపి, వగరు, చేదు, కారం లాంటి రుచులు ఉంటాయి. జీవితంలో కష్టసుఖాలు, ఆనంద దుఃఖాల లాగే ఈ రుచులన్నీ కలగలిసి ఉంటాయ‌న్నారు . ఈ ఏడాది అంతా మంచే జరగాలని అందరం కోరుకుంటున్నాం అన్నారు. తెలుగు వారి సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ ఉగాదిని అధికారికంగా నిర్వహించు కుంటున్నాం అని పేర్కొన్నారు.

ప్రతీ ఒక్కరం వేడుకగా ఉగాది నిర్వహించుకుని పంచాంగ శ్రవణం చేస్తాం అన్నారు సీఎం . ఈ ఏడాది 38 మందికి కళారత్న అవార్డులు, 122 మంది ఉగాది పురస్కారాలకు ఎంపికయ్యారు. వారందరికీ శుభాకాంక్షలు . తెలుగు సంస్కృతి వినూత్నం, పండుగలు విభిన్నం, ప్రకృతిని ఆరాధన, ఆరోగ్యకరమైన జీవన విధానానికి ఇవి ప్రతీకలు అని పేర్కొన్నారు సీఎం. సంక్రాంతి మొదలుకొని అన్ని పండుగలకు విశిష్టత, ప్రాముఖ్యాలు ఉన్నాయని చెప్పారు. ఆరోగ్యకరమైన జీవన శైలిని మన పండుగలు ప్రతిబింబిస్తాయి. నేలను, ప్రకృతిని, నీటిని పూజిస్తాం అన్నారు. మూడో సారి గోదావరి పుష్కరాలను నిర్వహించే గౌరవం నాకు దక్కింద‌ని చెప్పారు నారా చంద్రాబు నాయుడు. నీటిని పరిరక్షించేలా నీటి భద్రత అనే విధానాన్ని తీసుకు వ‌చ్చామ‌న్నారు. తాగడానికి, సాగుకు, పరిశ్రమలకు, పర్యావరణం కోసం నీరు కావాలి అని పేర్కొన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *