శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న అనిత

రాష్ట్ర హోం శాఖ మంత్రికి ఘ‌న స్వాగ‌తం

అనకాపల్లి : ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పుగా, కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పేరుగాంచిన అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయంలో కొత్త అమావాస్య వార్షిక జాతర మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోం మంత్రి అనితకు ఆలయ అధికారులు , అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు.

ఆలయ అధికారులు మంత్రి అనితకు అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించి, తీర్థ ప్రసాదాలు సమర్పించారు. నెల రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతున్న నూకాలమ్మ అమ్మవారి జాతరకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తుండగా, వారి సౌకర్యాల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఈ సందర్భంగా మంత్రి అనిత క్యూ లైన్లో ఉన్న భక్తులతో మాట్లాడి, ఏర్పాట్లపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.

  • Related Posts

    శ్రీ‌వారి ఉద్యోగులకు వెండి డాలర్‌, ప్రశంసా పత్రాలు

    తిరుపతి : తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్‌ మైదానంలో టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. భద్రతా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ…

    ఆగ‌స్టు 17 నుంచి ఆధ్యాత్మిక సేవ‌ల‌పై జాతీయ స‌ద‌స్సు

    తిరుపతి : తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ వైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. శ్రీ రామానుజులు, ఆచార్య పుండరీకాక్షులు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *