ముంద‌స్తు అరెస్ట్ ల‌పై బీజేపీ ఆగ్ర‌హం

నిప్పులు చెరిగిన క‌సిరెడ్డి సింధు రెడ్డి

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌జా పాల‌న కొన‌సాగ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు రాష్ట్ర బీజేవైఎం నాయ‌కురాలు క‌సిరెడ్డి సింధు రెడ్డి. సోమ‌వారం బీజేపీ ఇచ్చిన పిలుపు మేర‌కు ఆమె నిర‌స‌న‌లో పాల్గొనేందుకు ప్ర‌య‌త్నం చేశారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు ముంద‌స్తుగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. త‌న‌ను గృహ నిర్బంధం చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మాట్లాడే కాంగ్రెస్ ఆచ‌ర‌ణ‌లో దానిని బొంద పెట్టేందుకు య‌త్నిస్తోంద‌ని ఆరోపించారు సింధు రెడ్డి.

ప్రజాస్వామ్యాన్ని నేడు కాళ్లతో తొక్కుతోందని ధ్వ‌జ‌మెత్తారు. ఇదేనా ప్ర‌జా ప్ర‌భుత్వం అంటే అని ప్ర‌శ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామ‌చంద‌ర్ రావు ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకులపై ముందస్తు అరెస్టులు చేయించడం ప‌ట్ల మండిప‌డ్డారు సింధు రెడ్డి. ఇది వారి భయాన్ని బహిర్గతం చేస్తోందన్నారు. ఈ రోజు ఉదయం 6 గంటలకే నా ఇంటి ముందు 5 మంది పోలీసులు నిలబడి నన్ను హౌస్ అరెస్ట్ చేయడం, ప్రజల స్వరాన్ని అణచి వేయాలనే ప్రయత్నమే త‌ప్పా మ‌రోటి కాద‌న్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *