రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఓన‌ర్ కు జాక్ పాట్

భారీ ధ‌ర‌కు అమ్ముడు పోయిన ఐపీఎల్ టీం

రాజ‌స్థాన్ : భారతీయ క్రికెట్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడు పోయి చ‌రిత్ర సృష్టించింది ఐపీఎల్ టీం రాజ‌స్థాన్ రాయ‌ల్స్. సంస్థ య‌జ‌మాని మ‌నోజ్ బ‌దాలేకు పంట పండింది. ఒక ర‌కంగా చెప్పాలంటే ఆయ‌న జాక్ పాట్ కొట్టార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఒక‌టా రెండా ఏకంగా రూ. 15 వేల కోట్ల‌కు అమ్ముడు పోవ‌డం విస్తు పోయేలా చేసింది. త‌ను 2008లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టును రూ. 320 కోట్లకు కొనుగోలు చేశారు.
గత సంవత్సరం, ఆయన రాజస్థాన్ రాయల్స్ 100% వాటాలను అమ్మడానికి బిడ్లను ఆహ్వానించారు.

కొలంబియా పసిఫిక్ క్యాపిటల్ పార్ట్‌నర్స్ (CPCP) సహ-వ్యవస్థాపకులైన నిషా సచ్‌దేవా , దేబ్‌జీత్ గుప్తా, RR కోసం $1.7 బిలియన్ల బిడ్ వేశారు.రాబ్ వాల్టన్ , హాంప్ కుటుంబం మద్దతు ఉన్న కల్ సోమాని నేతృత్వంలోని కన్సార్టియం, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కోసం $1.63 బిలియన్ల బిడ్ వేసింది. ఇదిలా ఉండ‌గా మనోజ్ బదాలే CPCP బిడ్‌ను తిరస్కరించి, ఫ్రాంచైజీని కల్ సోమాని నేతృత్వంలోని కన్సార్టియమ్‌కు అమ్మారు. వాల్టన్, హాంప్ కుటుంబాలు NFLలో డెన్వర్ బ్రాంకోస్ , డెట్రాయిట్ లయన్స్ వంటి జట్లకు యజమానులు.వాల్టన్‌లు 2022లో బ్రాంకోస్‌ను $4.5 బిలియన్లకు కొనుగోలు చేశారు. హాంప్‌లు 1963లో లయన్స్‌ను $4.5 మిలియన్లకు కొనుగోలు చేశారు .

  • Related Posts

    ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడేది క‌ష్ట‌మే ..?

    చెన్నై : అంద‌రి క‌ళ్లు మ‌హేంద్ర సింగ్ ధోనీపై ఉన్నాయి. ఈ ఏడాది 2026లో జ‌రిగిన ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించ‌లేదు సీఎస్కే జ‌ట్టు. నిరాశజనకమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరలేక పోయింది, ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి…

    ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు

    ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో తొలిసారిగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేద‌న్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *