ఆర్డీటీకి లైన్ క్లియ‌ర్ ప‌ట్ల ఎమ్మెల్యే ఆనందం


ప్ర‌ధాని, అమిత్ షా, సీఎం, లోకేష్ కు కృత‌జ్ఞ‌త‌లు

అనంత‌పురం జిల్లా : టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌మ అనంత‌పురం జిల్లాలో విస్తృతంగా సేవ‌లు అందిస్తున్న రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ ట్ర‌స్ట్ (RDT) సేవ‌లను కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల సంతోషం వ్య‌క్తం చేశారు. ఆమె ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. ఎంతో మంది పేదల జీవితాలకు అండగా నిలుస్తూ సేవలు అందిస్తున్న మాంచో ఫెర్రర్ కి ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలియ జేస్తున్నానని పేర్కొన్నారు. అలాగే ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం రెన్యువల్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి, ఇందుకు సహకరించిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకి, ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడుకు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, మంత్రి నారా లోకేష్ కి అనంతపురం ప్రజల తరపున ప్రత్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపా.రు.

ఫారిన్ ఫండ్స్ పొందేందుకు గాను కేంద్రం ఆ మ‌ధ్య‌న ఆర్డీటీ సంస్థ‌కు షాక్ ఇచ్చింది. నిధులు రాకుండా నిషేధం విధించింది. దీంతో ప‌లు ప్రాంతాల‌లో నిత్యం చేస్తున్న ఆర్డీటీ సేవ‌ల‌కు అంత‌రాయం ఏర్ప‌డింది. విష‌యం తెలుసుకున్న మంత్రి నారా లోకేష్ సంస్థ అధినేత‌కు భ‌రోసా ఇచ్చారు. ఆపై కేంద్రంతో మాట్లాడారు. తిరిగి లైన్ క్లియ‌ర్ చేసేలా ప్ర‌య‌త్నం చేశారు. ఆయ‌న చేసిన కృషి ఫ‌లించింది. ఇదిలా ఉండ‌గా రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్టు పేరుతో అనంతపురం జిల్లాలో పలు వైద్య, సామాజిక కార్యక్రమాలు చేపడుతోంది. మత మార్పిడిలకు పాల్పడుతున్నారంటూ సంస్థపై ఆరోపణలు వ‌చ్చాయి. ఏడాది క్రితం FCRA అనుమతులు నిలిపి వేసింది.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *