సీఎం రేవంత్ రెడ్డికి అంత సీన్ లేదు

ఎద్దేవా చేసిన కేర‌ళ సీఎం విజ‌య‌న్

కేర‌ళ : తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డికి అంత సీన్ లేదంటూ ఏకి పారేశారు కేర‌ళ సీఎం పిన‌ర‌య్ విజ‌య‌న్. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకుంది. ఈ నెల‌లోనే శాస‌న స‌భ‌కు సంబంధించి ప‌లువురు అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు. స్టార్ క్యాంపెయిన‌ర్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున సీఎం రేవంత్ రెడ్డి క్యాంపెయిన్ చేశారు. ఇదే క్ర‌మంలో ఆయ‌న సీఎం పిన‌ర‌య్ విజ‌య‌న్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. ఇక త‌న శ‌కం ముగిసింద‌ని, ఓడి పోవ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పాడు.

ఈ సంద‌ర్బంగా కేర‌ళ సీఎం పిన‌య‌ర్ విజ‌య‌న్ తీవ్రంగా స్పందించాడు. రేవంత్ రెడ్డిపై భ‌గ్గుమ‌న్నారు. ఆయ‌న‌లో రాజకీయ నాయ‌కుడికి ఉండాల్సిన ల‌క్ష‌ణాలు లేవ‌న్నాడు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఓటుకు నోటు దొంగ.. రేవంత్ గురించి నేనేమి మాట్లాడుతానని పేర్కొన్నాడు. అతను ఓటు చోరీ చేశాడని మీ అందరికి తెలుసు అన్నారు. ఇక త‌ను నా గురించి మాట్లాడేంత మొగోడు కాద‌న్నారు. ఒక‌రిపై రాళ్లు వేసేట‌ప్పుడు ముందు వెనుకా ఆలోచించి మాట్లాడాల‌ని హిత‌వు ప‌లికారు. కేరళ ప్రజలు దొంగల మాటలు ఎప్పుడు విశ్వసించరని అన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *