మాతా అమృతానందమయి ఆశీర్వాదం అద్భుతం

సంతోషం వ్య‌క్తం చేసిన బీజేపీ నేత విష్ణు వ‌ర్ద‌న్ రెడ్డి

కేర‌ళ : కోట్ల మంది ప్రేమించే అమ్మ శ్రీ మాతా అమృతానందమయి ఆశీస్సులు అందుకోవ‌డం ఆనందంగా ఉంద‌న్నారు బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు విష్ణు వ‌ర్ద‌న్ రెడ్డి. ప్రపంచ వ్యాప్తంగా ప్రేమ, శాంతి, పేదల శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తూ కోట్లాది మందిని ఆధ్యాత్మికంగా, సామాజికంగా దగ్గరకు తీసుకుని, సేవతో పాటు మానవ విలువలను బోధిస్తున్న మాతా అమృతానందమ‌యి గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని పేర్కొన్నారు.

భక్తుడిగా అమ్మ వారి ఆశీస్సులు పొందడానికి కేరళ రాష్ట్రం లోని కొల్లం జిల్లాలో సముద్రం తీరానికి దగ్గరగా, ఉన్న వారి ఆశ్రమానికి వెళ్లిన నన్ను ఎంతో ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నార‌ని తెలిపారు. దేశం, సమాజం, సేవా కార్యక్రమాలు, పేదల అభ్యున్నతి వంటి అనేక ముఖ్యమైన విషయాలపై సుదీర్ఘంగా చర్చించడం నాకు ఎంతో ప్రేరణనిచ్చిందని అన్నారు. సమాజంలో మార్పు తీసుకు రావాలంటే సేవాభావం, నిబద్ధత, సహనం ఎంత ముఖ్యమో వారు వివరించిన విధానం ఎంతో ప్రభావితం చేసిందన్నారు.

పలు అంశాలపై వారు అందించిన మార్గదర్శకాలు నాకు భవిష్యత్‌లో మరింత స్పష్టతను ఇచ్చాయని తెలిపారు. ముఖ్యంగా, సేవలో మరింత భాగస్వామ్యం కావాలని, ప్రజలకు మరింత చేరువ కావాలని వారు ఇచ్చిన సూచనలు నా మీద ఉన్న బాధ్యతను మరింత పెంచేలా చేశాయ‌న్నారు.

  • Related Posts

    శ్రీ‌వారి ఉద్యోగులకు వెండి డాలర్‌, ప్రశంసా పత్రాలు

    తిరుపతి : తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్‌ మైదానంలో టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. భద్రతా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ…

    ఆగ‌స్టు 17 నుంచి ఆధ్యాత్మిక సేవ‌ల‌పై జాతీయ స‌ద‌స్సు

    తిరుపతి : తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ వైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. శ్రీ రామానుజులు, ఆచార్య పుండరీకాక్షులు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *