జీవ‌న్ రెడ్డిని చూసి జ‌నం న‌వ్వుకుంటున్నారు

ఎద్దేవా చేసిన టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్

హైద‌రాబాద్ : మాజీ మంత్రి, ఎమ్మెల్సీ టి. జీవ‌న్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరుతుండ‌డం ప‌ట్ల స్పందించారు టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. జీవన్ రెడ్డి పార్టీ మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. త‌న‌కు కాంగ్రెస్ పార్టీలో అన్ని రకాలుగా గౌరవం ఇవ్వ‌డ జ‌రిగింద‌న్నారు. పార్టీ హైక‌మాండ్ కూడా ఫుల్ సపోర్ట్ ఇచ్చింద‌న్నారు. ఆయ‌న‌కు ఇచ్చినంత ప్ర‌యారిటీ ఏ నేత‌కు ఇవ్వ‌లేద‌న్నారు. ప‌లుమార్లు త‌న‌కు బి ఫాంలు ఇచ్చింద‌న్న విష‌యం మ‌రిచి పోకూడ‌ద‌న్నారు టీపీసీసీ చీఫ్‌.

అయితే స్థానికంగా జరిగిన చిన్న సమస్యలతో జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడార‌ని చెప్పారు. విచిత్ం ఏమిటంటే అవినీతి చేశారని కేసీఆర్‌ని విమర్శించిన జీవన్ రెడ్డి ఉన్న‌ట్టుండి కేసీఆర్ చెంత చేరడంతో ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు మ‌హేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లి జీవన్ రెడ్డి తప్పు చేశార‌ని అన్నారు. లెక్కలతో సహా బీఆర్ఎస్ అవినీతిని మాకంటే ఎక్కువ జీవన్ రెడ్డి చెప్పారన్నారు. BRS పార్టీలోకి జీవన్ రెడ్డి వెళ్లడాన్ని జగిత్యాల ప్రజలు జీర్ణించు కోలేక పోతున్నార‌ని పేర్కొన్నారు. అయితే జీవ‌న్ రెడ్డి అంటే త‌మ‌కు కోపం లేద‌ని, త‌న ప‌ట్ల గౌర‌వం ఉంద‌న్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *