16న చాగంటి కోటేశ్వరరావు ధార్మికోపన్యాసం

వెల్ల‌డించిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం

తిరుపతి : టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. టీటీడీ ఆధ్వ‌ర్యంలోని హిందూ ధర్మప్రచార పరిషత్ భ‌క్తుల‌లో మ‌రింత భ‌క్తి భావం పెంపొందించేలా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ వ‌స్తోంది. ధర్మ ప్రచార కార్యక్రమాలు భక్తులలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించేందుకు నిరంతరం నిర్వహించ బడుతున్నాయి. ఈ కార్యక్రమాలలో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఏప్రిల్ 16వ తేదీ గురువారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 5.30 గంటలకు ధార్మికోపన్యాసం చేయనున్నారు.

ఈ సందర్భంగా ఆయన “నిత్య జీవితంలో ధర్మాచరణం” అనే అంశంపై భక్తులకు ఆధ్యాత్మిక సందేశాన్ని అందించనున్నార‌ని వెల్ల‌డించింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ). భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ ధార్మిక ఉపన్యాసాన్ని ఆలకించి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందవలసిందిగా టీటీడీ కోరింది. అంతే కాకంఉడా చాగంటి ఉప‌న్యాసాన్ని టీటీడీ ఆధ్వ‌ర్యంలో శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌సారం చేస్తుంద‌ని తెలిపింది.

  • Related Posts

    శ్రీ‌వారి ఉద్యోగులకు వెండి డాలర్‌, ప్రశంసా పత్రాలు

    తిరుపతి : తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్‌ మైదానంలో టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. భద్రతా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ…

    ఆగ‌స్టు 17 నుంచి ఆధ్యాత్మిక సేవ‌ల‌పై జాతీయ స‌ద‌స్సు

    తిరుపతి : తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ వైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. శ్రీ రామానుజులు, ఆచార్య పుండరీకాక్షులు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *