కేంద్ర స‌ర్కార్ కు టీడీపీ పూర్తి మ‌ద్ద‌తు

మహిళా సాధికారత దిశగా అడుగులు

న్యూఢిల్లీ : ఏపీకి చెందిన మ‌హిళా ప్ర‌జా ప్ర‌తినిధులు పెద్ద ఎత్తున ఢిల్లీ బాట ప‌ట్టారు. పార్ల‌మెంట్ లో మూడు చారిత్రాత్మ‌క‌మైన బిల్లులు ప్ర‌వేశ పెట్టేందుకు శ్రీ‌కారం చుట్టారు . ఈ సంద‌ర్బంగా కేంద్ర స‌ర్కార్ లో కీల‌క భూమిక పోషిస్తోంది టీడీపీ కూట‌మి. ఇందులో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇత‌ర బాధ్యులంతా రాజ‌ధాని బాట ప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా వారంతా స్త్రీ శ‌క్తి గురించి ఏక‌రువు పెట్టారు. స‌మాజ , దేశ అభివృద్దిలో మహిళ‌లు కీల‌క పాత్ర పోషించార‌ని పేర్కొన్నారు.

దేశం వేస్తున్న చారిత్రక అడుగులకు సాక్షిగా నిలిచేందుకు, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 27 మంది తో కూడిన తెలుగుదేశం మహిళా ప్రజాప్రతినిధుల బృందం ఢిల్లీ చేరుకున్నారు. పార్లమెంటు ఉభయసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లుపై జరిగే చర్చలను ప్రత్యక్షంగా వీక్షించడంతో పాటు, మహిళలకు రాజకీయాల్లో పెద్దపీట వేస్తున్న ప్రధాని న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీని, స్పీకర్ ఓం బిర్లాను , కేంద్ర మంత్రులను కలిసి మా బృందం తరపున కృతజ్ఞతలు తెలియ జేయనున్నామ‌ని తెలిపారు మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. మంత్రులు సంధ్యారాణి , సవిత , సీనియర్ నేతలు పరిటాల సునీత , పంచుమర్తి అనురాధ, రాయపాటి శైలజ , గ్రీష్మ తో కూడిన ఈ బృందం మహిళా చైతన్యానికి , తెలుగుదేశం పార్టీ నారీ శక్తికి నిదర్శనం అని పేర్కొన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *