ఇరాన్ కు డొనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

మ‌రోసారి యుద్దానికి సిద్దంగా ఉన్నాం

అమెరికా : ప‌శ్చిమాషియాలో ఉద్రిక్త ప‌రిస్థితులు ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి. చ‌ర్చ‌ల పేరుతో కాల‌యాప‌న చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు అమెరికా దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్. మంగ‌ళ‌వారం మ‌రోసారి ఇరాన్ ను హెచ్చ‌రించారు. తాము చెప్పిన‌ట్లు ఒప్పందం చేసుకోవాల‌ని లేక‌పోతే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని పేర్కొన్నారు. త‌మ‌తో డీల్ కు ఓకే చెప్పాల‌ని, లేక‌పోతే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని పేర్కొన్నారు. ఒక‌వేళ ఇరాన్‌తో డీల్‌ కాకపోతే యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం అని ప్ర‌క‌టించారు ట్రంప్. యుద్ధానికి ఆయుధాలను సిద్ధం చేసుకున్నాం అని వెల్ల‌డించారు.

కాల్పుల విరమణ సమయంలో శక్తిని కూడగట్టుకున్నాం అని ప్ర‌క‌టించారు అమెరికా దేశ అధ్య‌క్షుడు. ఇరాన్ పోర్టుల దిగ్బంధనం అమెరికా సాధించిన విజయం అంటూ వెల్ల‌డించారు. త‌మ‌తో ఒప్పందం చేసుకోకుడా , లేకుండా కాల్పుల విరమణను కొనసాగించం అని స్ప‌ష్టం చేశారు. డీల్ ద్వారా శాంతి, భద్రత, రక్షణ ఏర్పడ తాయన్నారు. ఇరాన్ కోసం చాలా మంచి డీల్ సిద్ధం చేస్తున్నాం అని పేర్కొన్నారు. యావత్ ప్రపంచమే నా డీల్ చూసి గర్వపడుతోంద‌న్నారు డొనాల్డ్ ట్రంప్.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *