బీసీ స్టడీ సర్కిల్ థీమ్ సాంగ్ మంత్రి రిలీజ్

విడుద‌ల చేసిన పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో శ‌నివారం బీసీ స్టడీ సర్కిల్ థీమ్ సాంగ్ రిలీజ్ చేశారు రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆలోచన మేరకు రాజీవ్ అభయ హస్తం తో సివిల్స్ రాస్తున్న వారికి ఆర్థిక సహకారమే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుండి సరైన శిక్షణ పొంది అత్యధికంగా సివిల్స్ ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు ఈ సంద‌ర్బంగా మంత్రి. బీసీ స్టడీ సర్కిల్ లో 100 మందికి పైగా సివిల్స్ ప్రిలిమినరీ మే 24 వ తేదీ పరీక్షలు రాసే వారి ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో పాటు మోటివేషనల్ థీమ్ సాంగ్ రిలీజ్ చేయడం జరిగింద‌ని, త‌న‌కు ఆనందంగా ఉంద‌న్నారు.

బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులను ప్రోత్సహించడానికి బీసీ స్టడీ సర్కిల్ థీమ్ సాంగ్ రూపొందించడం అభినంద‌నీయ‌మ‌ని అన్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువత ఆత్మస్థైర్యం తో సాధించాలని, నిర్దేశించుకున్న‌ లక్ష్యంతో ముందుకు పోవాలని పిలుపునిచ్చారు పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్. బీసీ స్టడీ సర్కిల్ ద్వారా సివిల్స్ , గ్రూప్స్, నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *