శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలకు అంకురార్పణ

భారీ ఎత్తున హాజ‌రైన భ‌క్త బాంధ‌వులు..టీటీడీ భారీ ఏర్పాట్లు

తిరుపతి : తిరుచానూరు లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వసంతోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. సాయంత్రం 6 నుండి 7.30 గంటల వరకు పుణ్యా హవచనం, రక్షా బంధనం, అంకురార్పణ, సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు . ఏప్రిల్ 30 నుండి మే 2 వరకు వసంతోత్సవాలు జరుగనున్నాయి. భక్తులు రూ.150 చెల్లించి ఈ ఉత్సవాల్లో పాల్గొనవచ్చు అని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్తానం పాల‌క మండ‌లి జేఈవో వి. వీర‌బ్ర‌హ్మం తెలిపారు.

మే 1న ఉదయం 9.30 గంటలకు స్వర్ణ రథోత్సవం జరుగుతుందని పేర్కొన్నారు. మూడు రోజుల పాటు మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 4.30 వరకుస్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7.30 నుండి 8.30 వరకు అమ్మవారు నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా విహరిస్తారు. ఇవాళ జ‌రిగిన ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో హరీంధ్రనాథ్, అర్చకులు బాబుస్వామి తదితరులు పాల్గొన్నారు. భారీ ఎత్తున వ‌చ్చిన భ‌క్తుల‌కు విస్తృత ఏర్పాట్లు చేసింది టీటీడీ.

  • Related Posts

    శ్రీ‌వారి ఉద్యోగులకు వెండి డాలర్‌, ప్రశంసా పత్రాలు

    తిరుపతి : తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్‌ మైదానంలో టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. భద్రతా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ…

    ఆగ‌స్టు 17 నుంచి ఆధ్యాత్మిక సేవ‌ల‌పై జాతీయ స‌ద‌స్సు

    తిరుపతి : తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ వైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. శ్రీ రామానుజులు, ఆచార్య పుండరీకాక్షులు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *