సిరుల తల్లికి స్న‌ప‌న తిరుమంజ‌నం

ఘ‌నంగా వ‌సంతోత్స‌వాల నిర్వ‌హ‌ణ

తిరుప‌తి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాల భాగంగా మధ్యాహ్నం 2.30 గంటలకు శుక్రవారం తోటలో స్నపన తిరుమంజనం అత్యంత వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి అలంకరించిన పూలమాలలు భక్తులకు కనువిందు చేశాయి. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హ‌రీంద్ర‌నాథ్, ఏఈఓ దేవరాజులు, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యల భక్తులు పాల్గొన్నారు.

ఇదిలా ఉండ‌గా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) పాల‌క మండ‌లి ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని ఏర్పాట్లు చేశారు. సుదూర ప్రాంతాల నుండి త‌ర‌లి వ‌చ్చారు భ‌క్త బాంధ‌వులు. సిరుల త‌ల్లి అమ్మ వారిని కొలిచినా, పూజ‌లు చేసినా పుణ్యం ద‌క్కుతుంద‌ని ప్ర‌గాఢ న‌మ్మ‌కం. ఇదిలా ఉండ‌గా ప్ర‌తి ఏటా సిరుల త‌ల్లి అమ్మ వారికి స్న‌ప‌న తిరుమంజ‌నం నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది.

  • Related Posts

    శ్రీ‌వారి ఉద్యోగులకు వెండి డాలర్‌, ప్రశంసా పత్రాలు

    తిరుపతి : తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్‌ మైదానంలో టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. భద్రతా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ…

    ఆగ‌స్టు 17 నుంచి ఆధ్యాత్మిక సేవ‌ల‌పై జాతీయ స‌ద‌స్సు

    తిరుపతి : తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ వైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. శ్రీ రామానుజులు, ఆచార్య పుండరీకాక్షులు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *