రికార్డు స్థాయిలో భార‌త రూపాయి ప‌త‌నం

అంత‌ర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు

ముంబై : అంత‌ర్జాతీయ ప‌రంగా చోటు చేసుకున్న ప‌రిణామాల కార‌ణంగా రికార్డ్ స్థాయిలో భార‌త రూపాయి ప‌త‌నం దిశ‌గా కొన‌సాగింది. ఇక అమెరిక‌న్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ₹95 దాటింది. ఏడాది కాలంలో గత 12 నెలల్లో రూపాయి విలువ 83.85 నుంచి 95.40కి పడి పోయింది. రూపాయి విలువ తగ్గడం వల్ల దిగుమతులు (ముఖ్యంగా చమురు, ఎలక్ట్రానిక్స్) ఖరీదైనవిగా మారి, ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) పెరిగే అవకాశం ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడటం ప్ర‌ధానంగా మారింది. క్రూడ్ ఆయిల్ ధరల పెంపు: బ్యారెల్ చమురు ధర దాదాపు $100కి పెరగడం మార్కెట్ పై ప్ర‌భావం చూపుతోంది. విదేశీ మూలధన ప్రవాహం: పెట్టుబడిదారులు తమ నిధులను వెనక్కి తీసుకోవడం కూడా రూపాయి ప‌త‌నానికి కార‌ణ‌మైంద‌ని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇక రూపాయి విలువ స్థిరపడాలంటే, దిగుమతులు తగ్గి, విదేశీ పెట్టుబడులు పెరగాల్సిన అవసరం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

  • Related Posts

    ఆర్థిక ప‌రిస్థితి మెరుగు ప‌ర్చేందుకు ‘ఏఐ’ వినియోగం

    అమ‌రావ‌తి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రముఖ ఆర్థికవేత్త, మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్‌తో సమావేశమయ్యారు. వ్యాపార నిర్వహణ సౌలభ్యంకు ఎలాంటి ఆటంకం కలగకుండా, ఆదాయ వనరుల గండిని పూడ్చడానికి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడానికి ప్రభుత్వం…

    వైద్య రంగంలో పరిశోధనలకు క్వాంటం వ్యాలీ సేవలు

    అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌వారం కీల‌క అప్ డేట్ ఇచ్చారు. వైద్య రంగానికి సంబంధించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సదుపాయాలను తీసుకు రావటమే ఈ ఒప్పందం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *