ఇళ్ల కేటాయింపు కోసం ప్రత్యేక డ్రైవ్

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన మంత్రి పొంగులేటి

హైద‌రాబాద్ : రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.
2 BHK ఇళ్ల కేటాయింపు కోసం యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పూర్తయిన ఇళ్లతో పాటు వివిధ నిర్మాణ దశలలో ఉన్న ఇళ్ల లబ్ధిదారులను ఈ నెలాఖరులోగా గుర్తించాలని ఆయన స్ప‌ష్టం చేశారు. కాలనీల నుండి 5 నుండి 8 కిలోమీటర్ల పరిధిలో నివసించే వారిని మాత్రమే ఎంపిక చేయాలని కీల‌క సూచ‌న‌లు చేశారు. ఇప్పటికే పూర్తయిన ఇళ్లలో లబ్ధిదారులు నివసించేలా చూడాలని, అలాగే ఈ కాలనీలలో తాగునీరు, మురుగునీటి పారుదల, విద్యుత్ వంటి ప్రాథమిక సౌకర్యాల కల్పనను వేగవంతం చేయాలని ఆదేశించారు.

హైదరాబాద్ పరిధిలో గృహ స్థలాలు ఉన్న అర్హులైన లబ్ధిదారులకు ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రాలను పంపిణీ చేయాలని అన్నారు. ఇదిలా ఉండ‌గా ఇందిర‌మ్మ ఇళ్ల ల‌బ్దిదారుల‌కు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. ఇదే స‌మ‌యంలో వ‌చ్చే జూన్ 2న రెండో ద‌శ ఇళ్ల నిర్మాణానికి శ్రీ‌కారం చుట్ట‌నున్న‌ట్లు తెలిపారు . తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఇళ్లు పొంద‌ని వారికి తీపిక‌బురు చెప్పారు. ఈ సంద‌ర్బంగా ఇళ్ల ల‌బ్దిదారులు ముందుగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని కోరారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *