భావోద్వేగానికి లోనైన సునీల్ న‌రైన్

VijayaBhaskar · May 17, 2026
Spread the love

ఐపీఎల్ లో 200వ మ్యాచ్ ఆడిన ప్లేయ‌ర్

కోల్ క‌తా : ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్ ) 19వ సీజ‌న్ ఆద్యంత‌మూ ఉత్కంఠ‌ను రేపుతోంది. నువ్వా నేనా అన్న రీతిలో మ్యాచ్ లు కొన‌సాగుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ జ‌ట్టు ప్లే ఆఫ్స్ కు వెళుతుందో తెలియ‌క ఫ్యాన్స్ టెన్ష‌న్ ప‌డుతున్నారు. ఇదిలా ఉండ‌గా వ‌రుస విజ‌యాల‌తో దూసుకు పోతున్న శుబ్ మ‌న్ గిల్ సార‌థ్యంలోని గుజ‌రాత్ టైటాన్స్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్. ఆ జ‌ట్టు 29 ప‌రుగుల తేడాతో ఓడించింది. ఇక అజింక్యా ర‌హానే నాయ‌క‌త్వంలో కేకేఆర్ ఆరంభంలో అంత‌గా ఆక‌ట్టు కోలేక పోయినా ఇప్పుడు ప్లే ఆఫ్స్ రేసులో తాను కూడా ఉన్నాన‌ని తెలియ చేసింది. ఈ విజ‌యంతో ఆ జ‌ట్టు కూడా రెడీ అయ్యింది.

ఇక కోల్ క‌తా జ‌ట్టు అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ లో దుమ్ము రేపింది. ప్ర‌ధానంగా ఫిన్ అలెన్ ఆట దెబ్బ‌కు గుజ‌రాత్ బౌల‌ర్లు విల విల లాడారు. ఈ సంద‌ర్బంగా కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్టుకు చెందిన సునీల్ న‌రైన్ తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యాడు. త‌ను క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. ఎందుకంటే ఐపీఎల్ లో త‌ను ప్ర‌వేశించి 200 మ్యాచ్ లు ఆడాడు. ఒక ఆట‌గాడు ఇంతలా కంటిన్యూ కావ‌డం, ఆడ‌డం మామూలు విష‌యం కాదు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. ,ఒక సీనియర్ ఆటగాడిగా, 200 మ్యాచ్‌లు ఆడేందుకు అవసరమైన ప్రతిభను, ఆరోగ్యాన్ని, శారీరక బలాన్ని దేవుడు నాకు ప్రసాదించాడని పేర్కొన్నాడు.