తిరుమ‌ల స‌న్నిధిలో హోం శాఖ మంత్రి

VijayaBhaskar · May 18, 2026
Spread the love

రాష్ట్రం బాగుండాల‌ని కోరుకున్నాన్న అనిత‌

తిరుమ‌ల : వేస‌వి కాలం కావ‌డంతో భ‌క్త బాంధ‌వుల తాకిడి తిరుమల పుణ్య క్షేత్రాన్ని తాకింది. మ‌రో వైపు వివీఐపీలు సైతం తిరుమ‌ల బాట ప‌ట్టారు. తాజాగా సోమ‌వారం రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత తిరుమ‌ల‌కు విచ్చేశారు. ఆమెకు టీటీడీ, ఆల‌య అర్చ‌కులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. త‌న కుటుంబ‌తో క‌లిసి అనిత వంగ‌ల‌పూడి శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారిని ద‌ర్శించుకున్నారు. ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. TTD అధికారులు ఎంతో ఆప్యాయంగా, సాదరంగా స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు.

రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వాదాలు అందుకున్నారు వంగ‌ల‌పూడి అనిత‌, కుటుంబం. స్వామి వారి ప్రసాదంతో పాటు వేంక‌టేశ్వ‌ర స్వామి వారి చిత్ర‌ప‌టాన్ని అంద‌జేశారు. ఈ సంద‌ర్బంగా అనిత వంగ‌ల‌పూడి మీడియాతో మాట్లాడారు. స్వామి వారిని ద‌ర్శించు కోవ‌డం, తీర్త ప్ర‌సాదాలు అందుకోవ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. నాకు అత్యంత పవిత్రమైన, శుభప్రదమైన అనుభూతిని కలిగించింద‌ని అన్నారు హోం శాఖ మంత్రి. ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు నాయకత్వంలో, మన రాష్ట్రం సుసంపన్నంగా విలసిల్లాలని, ప్రజలందరూ శాంతి సౌఖ్యాలతో జీవించాలని స్వామి వారిని మనస్ఫూర్తిగా ప్రార్థించానని చెప్పారు.